భీష్మ రొమాన్స్ లో చెలరేగుతున్నాడే

0

నితిన్ – రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పండగల వేళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి వేడి పెంచింది టీమ్. నితిన్ స్టైలిష్ యాక్షన్ మోడ్ తో ఉన్న ఫోటో.. రష్మిక వెంట పడుతూ ఉన్న కొంటె గురుడి ఫోటోని రిలీజ్ చేస్తే అవి రెండూ ఆకట్టుకున్నాయి. భీష్మలో రెండు మూడు కోణాల్ని ఎలివేట్ చేస్తూ తీస్తున్న సినిమా ఇదని అర్థమైంది.

తాజాగా మరో కొత్త లుక్ రిలీజైంది. ఈ ఫోటోలో రష్మికతో నిండా ప్రేమలో ఉన్నాడు గురుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బృందం .. ఈ సినిమా నుంచి తొలి గ్లింప్స్ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. అందుకు నవంబర్ 7 ఉదయం 10 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ మొదటి గ్లింప్స్ తో ప్రధాన పాత్రల్లో ఉన్న రొమాంటిక్ టింజ్ ని ఎలివేట్ చేయబోతున్నారట. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు రచన బాధ్యతల్ని చేపట్టారు. నితిన్.. రష్మిక పాత్రల్లో గ్లింప్స్ ఎలా ఎలివేట్ చేశారు? అన్నది చూడాలి.

మహతి సాగర్ ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ – సంపత్- అనంత్ నాగ్ తదితరులు నటిస్తున్నారు. నితిన్ ఈ సినిమాతో పాటుగా `రంగ్ దే` అనే మరో చిత్రంతో బిజీగా ఉండగా.. రష్మిక మందన ..సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణలో బిజీ. తదుపరి బన్ని-సుకుమార్ సెట్స్ కి జాయిన్ అవుతుంది.
Please Read Disclaimer