భీష్మ టీజర్ టాక్

0

నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘భీష్మ’. ఈ సినిమాకు టాగ్ లైన్ ‘సింగిల్ ఫరెవర్’. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు.

టీజర్ ఓపెన్ చెయ్యగానే ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీని చూపిస్తారు. ఆ కంపెనీ ఛైర్మన్ ను “మీ తర్వాత మీ ఆస్తిని..ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకనుగుణంగా చూసుకునేదెవ్వరు సర్?” అంటూ ఒక వ్యక్తి అడుగుతాడు. “నాకు క్వాలిఫికేషన్స్ కన్నా క్వాలిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్” అంటూ తనకు వారసుడిగా ఎంపిక కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో ఆయన చెప్తారు. ఇక ఆ వ్యక్తి మన నితిన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా? ఇంట్రో సీన్ లోనే నితిన్ రౌడీలను చితక్కొడుతూ కనిపిస్తాడు.

నెక్స్ట్ సీన్ లో సంపత్ ఇంటర్వ్యూ తరహాలో నితిన్ ను “పేరేంటి?” అని అడుగుతాడు. “భీష్మ” అని సమాధానం ఇస్తాడు. వెంటనే సంపత్ రాజ్ “భీష్మ కాదు. భీష్మ సర్ అనాలి” అంటూ క్లాస్ పీకుతున్నట్టుగా చెప్తాడు. దానికి వెంటనే స్పందిస్తూ నితిన్ “అంటే నా పేరుకు సర్ యాడ్ చేస్తే ఏం బాగోదని” అంటూ అమాయకత్వంలా అనిపించే అతి వినయంతో ఒక సెటైర్ లాంటి జవాబిస్తాడు. పక్కన కూర్చుని ఉన్న బ్రహ్మాజీ అవాక్కవుతాడు. మరో సందర్భంలో “నా అదృష్టం ఆవగిజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉంది” అంటూ తన పరిస్థితిని నీరసంగా పంచ్ రూపంలో వివరిస్తాడు.

టీజర్ ఆద్యంతం సరదాగా సాగింది. అటు హీరోయిన్.. ఇటు కమెడియన్లు.. హీరో అందరూ కామెడీని పండించడంలో బిజీగా కనిపిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సింగిల్ ఫరెవర్ భీష్మ ప్రేక్షకులను మెప్పించేలాగానే కనిపిస్తున్నాడు. ఆలస్యం ఎందుకు.. టీజర్ చూసేయండి.
Please Read Disclaimer