అవి ప్రభాస్ పై ప్రేమతో వచ్చే గాసిప్స్ అంటున్న పెద్దమ్మ!

0

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’ మరో పది రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ మ్యానియా కనిపిస్తోంది. ‘సాహో’ కు సంబంధించిన విశేషాలతో పాటుగా ప్రభాస్ మ్యారేజ్ టాపిక్ కూడా చర్చకు వస్తోంది. ప్రభాస్ ఎంత ఖండించినా పెళ్ళి వార్తలు మాత్రం ఆగడం లేదు. ఒకసారి ఎన్నారై అమ్మాయి అంటారు.. మరోసారి అనుష్క శెట్టి అంటారు.. లేకపోతే ఒక భీమవరం అమ్మాయి అంటారు. కానీ ఎన్ని వార్తలు వచ్చినా అవి జస్ట్ గాసిప్స్ గానే మిగిలిపోతున్నాయి. “భీమవరం అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ అయింది.. త్వరలోనే ప్రభాస్ ఒకింటివాడు కాబోతున్నాడు” అనేది రెగ్యులర్ గా వినిపించే వార్త.

రీసెంట్ గా ఈ విషయంపై కృష్ణంరాజు గారి సతీమణి..ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవిగారిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆవిడ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. భీమవరం నుండి చాలామంది అమ్మాయిలు ప్రభాస్ ను పెళ్ళి చేసుకుంటామని ఇంటికి వస్తుంటారని.. తనను అడుగుతుంటారని వెల్లడించారు. వారందరికీ ప్రభాస్ అంటే చాలా ప్రేమ ఉందనే విషయం తనకు తెలుసని చెప్పారు.. అయితే ఈ ప్రేమతోనే కొందరు పెళ్ళి గాసిప్స్ ప్రచారం చేస్తుంటారని అన్నారు. ఎప్పుడూ ప్రభాస్ గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇలా జరుగుతోందని ఆవిడ అభిప్రాయపడ్డారు.

అంతా బాగానే ఉంది.. కానీ ప్రభాస్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడనే విషయంపై మాట్లాడకుండానే ఇంటర్వ్యూ పూర్తి చేశారు. అంటే ప్రభాస్ కు ఈ విషయంలో తన వైపు నుండి మద్దతు ఉన్నట్టే అనుకోవాలేమో!
Please Read Disclaimer