ఆ నటికి అక్రమంగా విడాకులు ఇచ్చేశాడట!

0

ఆమో ప్రముఖ నటి. తన భర్త కనిపించట్లేదంటూ కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇంతలో ఆమెకు భర్త విడాకులు ఇచ్చినట్లుగా సమాచారం రావటంతో అవాక్కు అయ్యారు. తనకు అక్రమపద్దతిలో విడాకులు ఇచ్చారంటూ వాపోతుంది సదరు నటి. ఇంతకూ ఆ నటి ఎవరోకాదు.. భోజ్ పురిలో నటిగా సుపరిచితురాలైన అలీనా షేక్. వంద రూపాయిల స్టాంపు పేపరు పై భర్త తలాఖ్ ఇచ్చారంటూ ఆమె ఆరోపిస్తున్నారు.

సినీ నటి అలీనాకు మూడేళ్ల క్రితం అంటే.. 2016లో ముదస్సిర్ బేగ్ తో పెళ్లి జరిగింది. రెండు నెలల క్రితమే ఈ దంపతులకు ఒక పిల్లాడు పుట్టాడు. పది రోజుల క్రితం బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన ఆమె.. భర్త కోసం గాలించారు.

దీంతో.. తన భర్త మిస్సింగ్ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి రాలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన భర్త క్షేమంగా ఉన్నారని.. కాకుంటే పది రోజుల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చినట్లుగా సమాచారం అందటంతో అవాక్కు అయ్యారు. తన భర్త తనకు అక్రమపద్దతిలో విడాకులు ఇచ్చినట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.

తనపై అత్తింటివారు దాడికి పాల్పడినట్లుగా చెబుతున్న సదరు సినీ నటి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ..భార్యభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెబుతున్నారు. ఓవైపు ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై ఆసక్తికరచర్చ జరుగుతున్న వేళ.. ఒక నటికి తెలీకుండా ఆమె భర్త సింఫుల్ గా తలాక్ నామాతో విడాకులు ఇచ్చినట్లుగా చెబుతున్న వైనం కొత్త చర్చకు తావిస్తోందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer