భూమిక అప్పుడు హోమ్లీ.. ఇప్పుడు హెవెన్లీ!

0

సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. మహేష్ బాబు ‘ఒక్కడు’.. ఎన్టీఆర్ ‘సింహాద్రి’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భూమిక అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా ఉండేది. అలా అని ఈ జెనరేషన్ ప్రేక్షకులకు తెలియదు అనుకుంటారేమో కానీ అలా ఏంలేదు.. కొంత కాలం క్రితం ‘ఎంసీఎ’ సినిమాలో నానికి వదిన పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ‘యు టర్న్’.. ‘సవ్యసాచి’ సినిమాల్లో కూడా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భూమికకు మంచి ఆఫర్లే వస్తున్నాయట.

ఇదంతా ఒక ఎత్తైతే భూమిక ఈ లేటు వయసులో కూడా హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ ఈ ట్రెండ్ కు తగ్గట్టు ఉన్నానని హాటు సందేశం ఇస్తోంది. తాజాగా భూమిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “2009” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ ఫోటో పదేళ్ళ క్రితం తీసిందని అర్థమేమో. ఫోటో మాత్రం అదిరిపోయింది. బ్లాక్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ పై యమా స్టైల్ గా పడుకుంది. బ్లాక్ కలర్ టాప్.. సేమ్ కలర్ షార్ట్ ధరించింది. పై బటన్స్ పెట్టుకోకపోవడంతో కొంచెం హాట్నెస్ కనిపిస్తోంది. ఇక ఆ కూలింగ్ గ్లాసెస్ కూడా స్టైల్ ను మరింతగా పెంచాయి.

మొదటి నుంచి భూమిక హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మరి నలభైలలో ఈ హాటు రూటు ఎందుకు ఎంచుకుంటుందో ఫిలిం మేకర్లకే తెలియాలి. ఇదిలా ఉంటే ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “బిందాస్ లుక్”.. “ఆసము.. మైండు బ్లోయింగు”.. “ఈ వయసులో ఈ హాట్ షోలు ఎందుకు?” అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఇక భూమిక ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలయ్య ‘రూలర్’ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తమిళంలో ‘కన్నై నంబాదే’ అనే సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer