సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ…?

0

ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రి భూమా అఖిలప్రియ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన అఖిల ప్రియ తన తండ్రి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసిన అఖిల ప్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన వైస్సార్సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయింది. అయితే రాజకీయంగా ఓడిపోయిన అఖిల ప్రియ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేసుకుందట. ఈ నేపథ్యం లో అఖిల ప్రియ తన భర్త భార్గవ్ నాయుడు తో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా లాక్ డౌన్ కి ముందు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగి పోయాయట. అయితే అనుకోకుండా వచ్చి పడిన కరోనా మహమ్మారి వలన వారి ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయట.

కరోనా నేపథ్యం లో గత మూడు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి చిన్న నిర్మాతల వరకు చాలా నష్టాలను చవి చూస్తున్నారు. ఇప్పటి నుండి సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ మళ్ళీ రికవర్ అవ్వలేమనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ – భార్గవ్ దంపతులు డైలమాలో పడ్డారట. ఇలాంటి సిచ్యుయేషన్ లో సినిమా నిర్మాణం లోకి దిగడం కరెక్టా కదా అని ఆలోచిస్తున్నారట. కరోనా పరిస్థితులు కంట్రోల్ లోకి వస్తే గానీ అఖిలప్రియ ప్లాన్స్ తెలిసే అవకాశం లేదు.

రాబోయే రోజుల్లో అఖిల ప్రియ – భార్గవ్ నాయుడు సినీ నిర్మాణంలోకి అడుగుపెడతారా లేదా తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన అఖిల ప్రియ చిత్ర పరిశ్రమ లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా మరేదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టొచ్చు అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇదే కనుక నిజమై మాజీ మినిస్టర్ మూవీ ప్రొడక్షన్ లోకి దిగితే ఇటు సినీ ఇండస్ట్రీలో అటు పాలిటిక్స్ లో సెన్సేషనల్ అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం ఎప్పటి నుంచో వస్తున్నదే. పాలిటిక్స్ కి సినీ ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంటుంది అనేది అందరూ కాదనలేని వాస్తవమే.
Please Read Disclaimer