బీచ్ ని మరిగించిన భూమి

0

కెరీర్ నల్లేరుపై బండి నడకలా సాగితే ట్రీట్ ఇదిగో ఇలా ఉంటుంది మరి. ఆ చిలౌట్ మూవ్ మెంట్ ని ఎవరితో అయినా షేర్ చేసుకోవాలంటే బికినీ బీచ్ ని మించిన ఛాయిస్ ఇంకేదీ ఉండదు సుమీ! అందుకేనేమో తన సంతోషాన్ని బాలీవుడ్ హాటీ భూమి పెడ్నేకర్ ఇదిగో ఇలా పంచుకుంది అందరితో.

2019 భూమి నామ సంవత్సరం!! అంటే తప్పేమీ కాదు. భూమి పెడ్నేకర్ వెరీ లక్కీ గాళ్. గత ఏడాది ఆరంభమే అభిషేక్ చౌబే తెరకెక్కించిన `సోంచిరియా`లో అవకాశం అందుకుంది. ఆ చిత్రం లో సుశాంత్ సింగ్ రాజ్పుత్- మనోజ్ బాజ్పేయి- రణవీర్ షోరే – అశుతోష్ రానా లాంటి స్టార్లతో పోటీ పడుతూ భూమి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. చక్కని హిట్ చిత్రంతో సంవత్సరాన్ని ప్రారంభించింది. కార్తీక్ ఆర్యన్ – అనన్య పాండేలతో కలిసి `పతి పత్ని ఐర్ వో` అనే చిత్రంలోనూ నటించింది. ఈ సినిమాతోనే ఏడాది ముగిసింది. 2019 ముగిసి 2020లో అడుగు పెడుతున్న ఆనందంలో తన కెరీర్ జ్ఞాపకాల్ని ఇదిగో ఇలా ఫోటోలు వీడియోల రూపంలో రివీల్ చేసింది.

భూమి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2019 లో తాను పోషించిన పాత్రలన్నిటినీ వర్ణిస్తూ అందుకు సంబంధించిన ఫోటోల్ని ఓ చోట రివీల్ చేసింది. మొదటి పోస్ట్ లో ఈ దశాబ్దం నాకు ఎంతో ఇచ్చింది. అందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపింది. అలాగే భూమి తన స్నేహితులతో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ని ఆస్వాధిస్తున్న వీడియోను షేర్ చేసింది. “ లైఫ్ అంతా అందమైన క్షణాల్ని ఆస్వాధిస్తున్నా. గత దశాబ్దం నాకు చాలా ఇచ్చింది. ఇది నాకు జీవితానుభవాలను ఇచ్చింది. అవి నన్ను ఎంతో బలోపేతం చేశాయి. గతించిన కాలంలో నేను ప్రేమించిన చాలా మందిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ శూన్యత ను ఎప్పటికీ ఫుల్ ఫిల్ చేయలేను. కానీ ఈ దశాబ్ధం నా కలను నెరవేర్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఇది మీ అందరూ నాకు ఇచ్చింది. మీ ప్రేమ తో పునీతమయ్యాను. జీవితంలో దేవదూతలే పరిచయమయ్యారేమో. అందుకు కృతజ్ఞతలు చెప్పలేను. ఇలాగే ఎప్పటికీ నన్ను ఆదరించండి. ప్రేమించండి. కృతజ్ఞతతో నిండి ఉన్నాను. నా ప్రియమైన మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. రానున్న దశాబ్దం మెరుగ్గా ఉండాలి. మెరుగైన ప్రపంచానికి హ్యాపీ న్యూఇయర్ #2020 “ అంటూ సుదీర్ఘంగా ఎమోషనల్ పోస్ట్ ని పెట్టింది భూమి.

వేరొక పోస్ట్ లో ఆకుపచ్చ రంగు బికినీలో మిలియన్ డాలర్ చిలౌట్ ని అందించే చిరునవ్వు చిందించింది. “ఈ దశాబ్దానికి నా మూడ్ ఇలానే.. హ్యాపీగా # హ్యాపీన్యూయర్ # 2020“ అంటూ మరో ఫోటో ని షేర్ చేసింది. ఇక 2020 భూమి కెరీర్ ని పరిశీలిస్తే.. `భూత్ 1: ది హాంటెడ్ షిప్` సహా దుర్గావతి అనే థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer