అడల్ట్ కామెడీతో చెలరేగుతున్న బ్యూటీ

0

భూమి పెడ్నేకర్.. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతున్న టాప్ బ్యూటీ. ఇటీవలే షార్ప్ షూటర్ సిస్టర్స్ చంద్రోతోమర్- ప్రకాషి తోమర్ ల బయోపిక్ `సాంద్ కి ఆంఖ్` లో నటించి ఆకట్టుకుంది. భూమి-తాప్సీ కలిసి సిస్టర్స్ పాత్రల్లో ఇరగదీశారు. ఈలోగానే భూమి పెడ్నేకర్ నటించిన `పతి పత్ని ఔర్ వో` అనే చిత్రం రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ అమ్మడు ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్స్ తో దుమారం రేపుతోంది.

అడల్ట్ కామెడీ నేపథ్యంలో రూపొందిన `పతి పత్ని ఔర్ వో` పోస్టర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సెక్సిస్ట్.. ఆడా మగా వైరుధ్యం వంటి సీరియస్ టాపిక్స్ ని.. ఫన్నీగా హ్యాండిల్ చేస్తున్నారు ఈ చిత్రంలో. ఇక ఇందులో భూమి కార్తీక్ ఆర్యన్ భార్య పాత్రలో నటిస్తోంది. అనన్య పాండే ఆఫీస్ లో ఎఫైర్ పెట్టుకునే అమ్మాయిగా నటిస్తోంది. ఈ చిత్రానికి ముదస్పార్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1978లో వచ్చిన `పతి పత్ని ఔర్ వో` క్లాసిక్ చిత్రానికి అధికారిక రీమేక్ ఇది.

భూమి పెడ్నేకర్ నటించిన బాలా త్వరలో రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా భూమి ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. వాటిలోంచి ఎక్స్ క్లూజివ్ ఫోటో ఇది.
Please Read Disclaimer