అదిరిన ఆరెంజ్ చీర ఘాటు

0

హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న భామలలో ఒకరు. విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న భూమి ఇతర బాలీవుడ్ బ్యూటీల తరహాలో జీరో సైజ్ వెంట పడదు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా సాధారణంగానే ఉంటుంది. అలా అని సోషల్ మీడియాలో వెనకపడిపోతే ఎలా..? అందుకే తన స్టైల్ లో సెక్సీ ఫోటో షూట్స్ మాత్రం చేస్తుంది.

ప్రస్తుతం భూమి ‘పతి పత్ని ఔర్ వో’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ కోసం చీరకట్టుకుని అందంగా తయారైంది. ఆ చీరలోనే రసవత్తరమైన ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “రస్ భరి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలలో నారింజ రంగు చీరలో నెటిజన్లకు చూడగానే జివ్వనిపించే పోజులిచ్చింది. ఒక ఫోటోలో మందుకు ఒంగి చూసింది.. మరో ఫోటోలో వెనక్కు తిరిగి బ్లౌజ్ బ్యాక్ అందాలను వడ్డించింది. మరో ఫోటోలో సైడ్ కు తిరిగి ఓరగా చూసింది.. ఇంకో ఫోటోలో కళ్ళు కూసుకుని చిలకనవ్వు నవ్వింది. ఈ ఫోటోలు కనుక చూస్తే జీరో సైజ్ బ్యూటీలు రసం లేని.. జస్ట్ నారింజ తొక్కలు.. ఈ భామ మాత్రం గ్లామరసం అణువణువునా నింపుకున్న నారింజ పండు అనే నిత్యానందమైన ఆత్మజ్ఞానం కలగడం ఖాయం.

ఈ ఫోటోలకు ఎంతో మంది ఇన్స్టా జ్ఞానులు స్పందించారు. “ఆయ్ హాయ్.. మార్ దియా”.. “ఏక్ నంబర్ సాడీ”.. “సెక్సీ ఆరెంజ్.. సో అట్రాక్టివ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక భూమి సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే ‘బాలా’ తో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ‘భూత్- పార్ట్ 1: ది హాంటెడ్ షిప్’.. ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ అనే సినిమాల్లో నటిస్తోంది. ‘పతి పత్ని ఔర్ వో’ రిలీజ్ కు రెడీగా ఉంది.
Please Read Disclaimer