రియల్ ఇండియన్ బ్యూటీ

0

బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ పేరు తెలిసే ఉంటుంది. ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథా’ లో హీరోయిన్. ఈ సినిమానే కాకుండా ‘దమ్ లగాకే హైషా’.. ‘శుభ్ మంగళ్ సావధాన్’.. ‘సొన్ చిడియా’ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. లుక్స్ వైజ్ సూపర్ అని చెప్పలేం కానీ నటనమాత్రం సూపర్. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బిజీ హీరోయిన్ గా మారింది. ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హంగామా మొదలు పెట్టింది.

తాజాగా ఈ భామ ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఈ మ్యాగజైన్ ఆగష్టు ఎడిషన్ కవర్ పేజిపై మెరిసింది. అంతే కాదు.. ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసే భామలు పేరుకు వెడ్డింగ్ డ్రెస్సెస్ అంటారు కానీ అవి సగం శోభనం అయిన తర్వాత ఒంటి మీద ఉండే డ్రెస్సుల తరహాలో ఉంటాయి! కానీ భూమి ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉన్నట్టుంది. ఎక్కడా అసభ్యత.. అందాల విందు అనే పదాలు లేకుండానే ఫోటోషూట్ ను పూర్తి చేసింది. కవర్ పేజిపై యువరాణిలా పల్లకీలో కూర్చున్న పోజు… ఇతర ఫోటోలలో బంతి పూలబుట్టల మధ్య కూర్చున్న పోజు.. ఇలా డీసెంట్ గా పని కానిచ్చింది.

ఈ ఫోటోలకు ఇన్స్టాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. “యువరాణిలా ఉన్నావు”.. “రియల్ ఇండియన్ బ్యూటీ”.. “కలర్ ఫుల్ డ్రెస్.. సో అట్రాక్టివ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక భూమి సినిమాల విషయానికి వస్తే ‘సాంద్ కి ఆంఖ్’.. ‘భూత్- పార్ట్ 1: ది హాంటెడ్ షిప్’.. ‘బాలా’.. ‘పతి పత్ని ఔర్ వో’ చిత్రాల్లో నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home