సుశాంత్ పై భూమిక ఎమోషనల్ పోస్ట్ వైరల్

0

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సుశాంత్ తో వర్క్ చేసిన పలువురు ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఆయన ఆత్మహత్య చేసుకుని వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆయనతో కలిసి ఎంఎస్ ధోని చిత్రంలో ఆయనకు అక్కగా నటించిన భూమిక చాలా ఎమోషనల్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నీ మరణ వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసింది. నీవు ఏ లోకంలో ఉన్నా భగవంతుడి చేతుల్లో ఉన్నావని అనుకుంటున్నాను. నీవు చనిపోయి వారం గడుస్తున్నా కూడా నీవు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తాలూకు కారణం మాత్రం తెలియలేదు. ఆ నిర్ణయం వెనుక కారణంను నీతోటే నీ గుండెలో మనసులో ఉండి సమాధి అయ్యింది. నీ మరణంతో ఎంతో మంది మనోవేదనకు గురవుతున్నారు. వారంతా కూడా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను.

నీ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీలో కొందరిపై విమర్శలు వస్తున్నాయి. మరికొందరి కారణంగా నీవు మరణించావు అంటూ ప్రచారం జరుగుతుంది. కాని నీవు లేని కారణంగా వాటన్నింటికి అసలు సమాధానం దొరికే అవకాశం లేదు. ఈ లోకంలో లేని వారి గురించి చెడుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కనుక సుశాంత్ గురించి చెడుగా మాట్లాడకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలంటూ భూమిక పేర్కొంది.
Please Read Disclaimer