భూమిక కంబ్యాక్.. రూలర్ వెల్కం

0

టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా స్టార్ హీరోల సరసన నటించిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అటుపై అమ్మ అక్క పాత్రలతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో నాని సరసన `ఎంసీఏ` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన భూమిక సమంత – యూటర్న్.. నాగచైతన్య- సవ్యసాచి చిత్రాల్లోనూ నటించారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో మరో భారీ చిత్రానికి భూమిక సంతకం చేశారు. భూమిక తిరిగి టాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `రూలర్`లో ఓ కీలక పాత్రను పోషించనున్నారట. ఈ చిత్రంలో అందాల భామలు సోనాల్ చౌహాన్- వేదిక కథానాయికలుగా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. భూమిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని కీలక పాత్రకు ఎంపికయ్యారని తెలుస్తోంది. బాలకృష్ణ -భూమికల పై ఉండే సన్నివేశాలను కోనసీమలో చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7న సినిమాని ప్రారంభించి అటుపై బ్యాంకాక్ లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తున్నారు. జైసింహా తర్వాత బాలకృష్ణకు మరో హిట్టివ్వాలన్న పట్టుదలతో కె.ఎస్.రవికుమార్ టీమ్ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారట. 2020 సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
Please Read Disclaimer