తన చావు కోరుతున్న వారికి బిగ్ బి కౌంటర్

0

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మరియు ఆయన తనయుడు కోడలు మనవరాలు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్యలు కరోనా నెగటివ్ అంటూ తేలడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక అమితాబ్ ఆరోగ్యం గురించి కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో అమితాబ్ రెగ్యులర్ గా తన హెల్త్ అప్ డేట్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు.

అమితాబ్ కోవిడ్ 19 తో మృతి చెందాలని కోరుకుంటున్నాం అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారట. ఆ విషయాన్ని కొందరు అమితాబ్ దృష్టికి తీసుకు వెళ్లారు. వారిపై అమితాబ్ అసహనం వ్యక్తం చేశారు. మిస్టర్ అజ్ఞాతవాసి మీరు మీ పేరు మాత్రమే రాశారు.. మీ తండ్రి పేరు రాయలేదు. అంటే మీకు మీ తండ్రి ఎవరో తెలిసి ఉండదు అనుకుంటున్నా అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక అమితాబ్ అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆయన ఈ పరిస్థితి నుండి బయట పడాలని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇల్లు చేరడంతో పాటు సినిమాల్లో కూడా నటించాలని కోరుకుంటున్నాం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.