బిగ్ బాస్ 3: యాంకర్ గెలవాలని నిర్మాత పూజలు

0

బిగ్ బాస్ లో ఈ రోజు చివరి రోజు. యాంకర్ కం నటి .. ట్యాలెంటెడ్ హౌస్ మేట్ శ్రీముఖి కి వోట్ వేసి గెలిపించండి… అంటూ ఒకటే ప్రచారం హోరెత్తిపోతోంది. ఓవైపు ఆన్ లైన్ సామాజిక మాధ్యమాల్లో మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా సదరు యాంకర్ గారి ప్రచారమే. హౌస్ లో ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే శ్రీముఖి ప్రచారం లో దూసుకుపోతోంది.

ఈ ఆదివారంతో ఫైనల్ రిజల్ట్ తేలనుంది. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యుల్లో ఎవరు విజేత అన్నది తేలిపోనుంది. శ్రీముఖి-బాబా భాస్కర్- అలీ- వరుణ్ సందేశ్- రాహుల్ ఇంకా ఇంట్లో విక్టరీ కోసం వెయిటింగ్. ఇక వీళ్లందరినీ డామినేట్ చేస్తోంది శ్రీముఖి. పరిశ్రమ తరపున సదరు యాంకర్ కి ప్రచారం చేసేందుకు పలువురు నిర్మాతలు.. సాటి యాంకర్లు ఎంతో వెంపర్లాడిపోవడం చర్చకు వచ్చింది. ప్రత్యేకించి తన గెలుపు కోసం సదరు సినీనిర్మాతలు ఇళ్లలో పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నారన్నది తాజా ట్విస్టు.

వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్రచారం పీక్స్ కి చేరుస్తున్న ఆ నిర్మాతలపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ‘ఆంతరంగిక సమాచారం ప్రకారం ఎవరు గెలిచినా ఓడినా స్వల్ప ఓట్ల తేడా ఉంటుంది అని తెలిసింది. కనుక మీ ప్రతి ఓటు చాలా విలువైనది. ప్లీజ్ ఒక్క వోట్ కూడా మిస్ చెయ్యకండి..శ్రీముఖిని బిగ్ బాస్ విన్నర్ చేయండి. ఈ రోజు రాత్రి 12గంటల వరకు వోటింగుకి సమయం ఉంటుంది. ఈ రోజు మీ మొబైల్ నుండి ******* నెంబర్ కీ (50) మిస్డ్ కాల్స్ చేస్తే 50 వోట్లు పడతాయి. హాట్ స్టార్ లో 10 వోట్లు వెయ్యండి మహాప్రభో ఈ మెస్సేజ్ ని మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి’ అంటూ ప్రాధేయ పడుతుండడం చూస్తుంటే ఎంతగా ప్రచారం హోరెత్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా బిగ్ బాస్ 3 ఇంట్లో శ్రీముఖికి ఇండస్ట్రీ తరపున ఎక్కువ సపోర్ట్ ఉందని ఈ సన్నివేశం చెబుతోంది. ఆ నిర్మాత కేవలం స్నేహం తోనే ఈ ప్రచారం చేస్తున్నారా? లేక తన సినిమాల ప్రమోషన్ సాయం తననుంచి ఆశించి ఇలా ప్లాన్ చేశారా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home