హిజ్రాగా మారిన బిగ్ బాస్ విజేత

0

ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న ఏకైక బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులోనూ ఈ షో చక్కని ఆదరణ పొందుతోంది. వివాదాలతో పాటు వినోదాన్నిఅందిస్తున్న ఈ షో ఇటీవలే సీజన్ 3 ని విజయవంతంగా ముగించారు. ఈ సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా విజేతగా నిలిచి హాట్ ఫేవరేట్ అనుకున్న శ్రీముఖికి షాకిచ్చాడు. దాదాపు 8 కోట్ల 50 లక్షల ఓట్లతో రాహుల్ ఈ టైటిల్ని గెలుచుకోవడం విశేషం.

బిగ్ బాస్ విన్ అయ్యాక రాహుల్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే పలు ఆసక్తికర సంగతులే తెలిసాయి. ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి కో మ్యూజిక్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ ధూల్ పేట మాసీవ్ సింగర్ ఆ తరువాత వీడియో సాంగ్స్ చేయడం.. కీరవాణి దృష్టిలో పడటంతో అనతి కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఎగ్రెసీవ్ గా దూసుకుపోయే తత్వం కావడంతో అందిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ గాయకుడిగా మాసీవ్ సాంగ్స్ తో మాంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు రాహుల్. బిగ్ బాస్ క్రేజ్ తో త్వరలో హీరోగానూ కనిపించే అవాశం వున్న రాహుల్ సిప్లిగంజ్ ఈ షోలోని ఎంటర్ కావడానికి ముందు ఓ వీడియో సాంగ్ ని చేశాడు.

హిజ్రాగా ఈ వీడియోలో రాహుల్ సిప్లిగంజ్ కనిపించడం విశేషం. ‘మైనేమ్ ఈజ్ హిజ్రా… మేము పుట్టిన ఒక తల్లికేరా..’ అనే పదాలతో హిజ్రాల వెతల్ని ఆవిష్కరిస్తూ రాహుల్ చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 34లక్షల 88 వేలు దాటి త్వరలో 50 లక్షలకు చేరబోతోంది. ఈ సాంగ్ కూడా బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి ఓ కారణంగా నిలిచినట్లు యూట్యూబ్ లో నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. రాహుల్ కి సింగర్ గానూ బోలెడంత ఫాలోయింగ్ ఉంది. అది బాగా కలిసొచ్చింది. ఇక అతడు మునుముందు ఈ తరహా ఆల్బమ్స్ లో నటించడమే గాక సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట.
Please Read Disclaimer