సైరా బిజినెస్ డీల్స్ వామ్మో అనిపిస్తున్నాయి

0

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న సైరా నరసింహారెడ్డి బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే రికార్డు ధరకు కర్ణాటక ఏరియా క్లోజ్ చేశారనే టాక్ ఉంది కాని ఇంకా అధికారిక ప్రకటన లాంటిదేమీ రాలేదు. ఇదిలా ఉండగా సుమారు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్టుగా చెబుతున్న సైరా బిజినెస్ ని అదే స్థాయిలో ఆశిస్తున్నాడట చరణ్.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం మొత్తం ఆరు ఏరియాలకు కలిపి ఆంధ్ర ప్రాంతం నుంచే సుమారు 60 కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ నుంచి ఆదాయం అడుగుతున్నారట. ఇది కాకుండా ఈ సినిమాకు చాలా కీలకంగా భావిస్తున్న సీడెడ్ కు ఏకంగా 25 కోట్ల దాకా అడిగినట్టు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు దీనికి దగ్గరగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నైజామ్ విషయానికి వస్తే ఎంతలేదన్నా 40 కోట్ల దాకా రేట్ పలకవచ్చని చెబుతున్నారు. ఓ ఐదారు కోట్లకు ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ ఇది పక్కా ఫిగర్ అని వినికిడి.

ఈ లెక్కన కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 120 కోట్ల దాకా బిసినెస్ చేసినట్టు అవుతుంది. కన్నడ-తమిళ్ – మలయాళం – హిందీ – ఓవర్సీస్ అదనం. మొత్తంగా ప్రీ రిలీజ్ నుంచే మొత్తం పెట్టుబడి వచ్చేసేలా పక్కా ప్లానింగ్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. హైప్ విషయంలో కొంత వెనుకబడినట్టు అనిపిస్తున్నా త్వరలోనే పబ్లిసిటీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచి అనే క్లారిటీ లేదు కానీ మెగా కాంపౌండ్ చెబుతున్న దానిప్రకారం జులై నెలాఖరు నుంచి సైరా సందడిని మెల్లగా స్టార్ట్ చేస్తారట.విడుదలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ బిజినెస్ డీల్స్ కు సంబంధించిన పూర్తి క్లారిటీ త్వరలో రావొచ్చు.
Please Read Disclaimer