అల్లు బ్రదర్స్ ముందు బిగ్ ఛాలెంజ్

0

గత కొంతకాలంగా అల్లు వారి ఆస్తుల పంపకాలు అంటూ ఓ సెక్షన్ మీడియాలో మోతెక్కిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన సోదరుడు అల్లు శిరీష్ ఎవరికి వారు సొంత ఆఫీస్ లతో కార్పొరెట్ విస్తరణకు దిగుతున్నారన్న సమాచారం లీకైంది. టాలీవుడ్ లో అంబానీ సోదరుల్లా తమకంటూ ఓ రేంజ్ ను చూపించబోతున్నారని ఫ్యాన్స్ లో గుసగుసలు వినిపించాయి. తాజా పరిణామం చూస్తుంటే అది నిజమేనని అర్థమవుతోంది. అల్లు బ్రదర్స్ ఎవరికి వారు సొంత ఆఫీస్ లు సెట్ చేసుకున్నారు. ఎవరికి వారు బిజినెస్ వ్వహారాల్ని వోన్ నాలెజ్ తో డీల్ చేస్తున్నారని అర్థమవుతోంది. బాస్ అల్లు అరవింద్ ఇద్దరు వారసులకు ఒక్కొక్కరికి ఒక్కో గోల్ ఫిక్స్ చేసి టార్గెట్లు ఇచ్చి మరీ కాంపిటీషన్ పెట్టారని ఫిలింవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్తగా ఆఫీస్ పై మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లోని పోష్ ఏరియాలో ఎంతో కాస్ట్ లీగా ఈ ఆఫీస్ ని సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇకపై బన్ని తన సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలన్నిటినీ ఇక్కడ నుంచే కొనసాగిస్తారట. ఇక సినిమా ఆఫీస్ అంటే అందరి ఆఫీస్ ల్లానే ఉంటుందనుకుంటే పొరబడినట్లే. స్లైలిష్ స్టార్ లానే తన ఆఫీస్ కూడా అంతే స్టైలిష్ గా ఉంటుందిట. తన కొత్త ఆఫీస్ కార్పోరేట్ ని తలపిస్తుంది. ఖరీదైన పర్నిచర్ ఆఫీస్ సరంజామా.. మీటింగ్ రూమ్స్ వగైరా చూస్తుంటే కోట్లాది రూపాయాలు వెచ్చించి డిజైన్ చేశారని .. ఆఫీస్ సువిశాలంగా ఆకట్టుకుంటోందని తెలుస్తోంది.

ఇంటిరీయర్ డెకరేషన్ కు సంబంధించి బన్ని స్వయంగా శ్రద్ధ తీసుకున్నాడుట. అందుకు అవసరమైన వాటిని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేశాడట. ఇందులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అంటే.. స్క్రిప్ట్స్ డిస్కషన్స్ కి ఒక రూమ్.. డైరెక్టర్స్ తో ఇంటరాక్షన్ కి సపరేట్ గా ఒక గది.. తనని వ్యక్తిగతంగా కలవడానికి వచ్చిన పెద్ద వ్యక్తుల కోసం సపరేట్ ఛాంబర్.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రత్యేకంగా ఓ హాల్ డిజైన్ చేయించాడుట. గీతా ఆర్స్ట్ యాడ్స్ కి సంబంధించి.. బ్రాండ్ అండ్ ఎండోర్స్ మెంట్ డీల్స్ కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ని ఏర్పాటు చేసాడుట. అలాగే మీడియా సమావేశాలకు ప్రత్యేకంగా ఒక హాల్ ఉందిట. బన్ని పర్సనల్ ఇంటర్వూలకు సంబంధించి సపరేట్ చాంబర్ ఏర్పాటు ఉంది. ఓవరాల్ గా బన్ని ఆఫీస్ ఓ పెద్ద కార్పోరేట్ ఆఫీస్ నే తలపిస్తుందని చెబుతున్నారు. ఇక బయట పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బంది లు లేకుండా ఎక్కువగా స్పేస్ కేటాయించారు. కార్లు.. బైక్ లు కి సపరేట్ పార్కింగ్ ఫెసిలీటీ ఉంది. ఇలా సకల సౌకర్యాలతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ఫిల్మ్స్ ఆఫీస్ గా బన్నీ దీన్ని తర్చి దిద్దినట్లు చూసిన వాళ్లు చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ తో పోలిస్తే ఇది ఎంతో లగ్జరియస్ గా ఉంటుంది. ఇక అల్లు శిరీష్ ఇప్పటికే ఓటీటీ కోసం సపరేట్ ఆఫీస్ ని మెయింటెయిన్ చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఓటీటీ- వెబ్ సిరీస్ లలో టార్గెట్లు అఛీవ్ చేయడమే గాక.. స్టార్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాలెంజ్ శిరీష్ ముందు ఉంచారట అల్లు బాస్ అరవింద్. ఇక తాను నటిస్తున్న రెండు సినిమాలు 2020లో రిలీజ్ కానున్నాయని మొన్ననే రివీల్ చశాడు శిరీష్. ఈ ప్లాన్ చూస్తుంటే అల్లు బ్రదర్స్ లో పోటీ తీవ్రంగానే ఉందని అర్థమవుతోంది. మరోవైపు ఈ వారంతంలో మెగాస్టార్ చిరంజీవి జూబ్లీ హిల్స్ లోని లగ్జరీ పాలటియాల్ రెసిడెన్స్ లోకి దిగుతున్నారు. ఈ షిఫ్టింగ్ ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయన్న సమాచారం అందింది.
Please Read Disclaimer