మన్మథుడికి అసలు సవాల్ ముందుంది

0

ఇవాళ లాంఛనంగా మన్మథుడు 2 మొదలైపోయింది. సుశాంత్ తో తీసిన చిలసౌ ద్వారా తన పనితనంతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా నాగ్ చాలా నమ్మకంతో దీన్ని అప్పగించాడు. ఇదో కొత్త కథ అయితే అప్పుడే ఎలాంటి అంచనాలు పెట్టుకోలేం కానీ ఈ టైటిల్ కి అక్కినేని ఫాన్స్ కి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది.

17 ఏళ్ళ క్రితం వచ్చిన మన్మథుడు ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ హత్తుకునేలా తీసే విజయ్ భాస్కర్ టేకింగ్ సోనాలి బెంద్రే గ్లామర్ తో కూడిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ బ్రమ్మీ కామెడీ ఇలా ఎన్నో కారణాలు అది బ్లాక్ బస్టర్ కావడానికి దోహదం చేశాయి. కానీ ఇప్పుడు నాగ్ బ్రమ్మీ తప్ప మిగిలిన అంశాలు వాడుకునే ఛాన్స్ లేదు. అన్ని కొత్తగా ఫ్రెష్ గా ఉండాల్సిందే.

అంచనాలు అందుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేదంటే మన్మధుడు టైటిల్ ని చెడగొట్టారనే చెడ్డ పేరు వస్తుంది. ఇదంతా తెలిసే రంగంలోకి దిగారు కాబట్టి రాహుల్ రవీంద్రన్ తగిన జాగ్రత్తే తీసుకుని ఉంటాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉండటం ఇంత పెద్ద స్టార్ ని డీల్ చేసే సత్తా ఇచ్చిందా అనేది ఇప్పుడే చెప్పలేం.

కానీ మన్మధుడుకి ఇది కొనసాగింపు కాకపోయినా పూర్తిగా వేరే సబ్జెక్టు అయినా టైటిల్ పరంగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి స్క్రిప్ట్ పక్కాగా ఉండాలి. దానికి తగ్గ ఆర్టిస్టులను సెట్ చేసుకోవాలి. అన్నింటిని మించి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎవర్ గ్రీన్ మ్యూజిక్ కు దీటుగా చేతన్ భరద్వాజ్ సంగీతం ఇవ్వాలి. సో మన్మథుడు మీద మాములు ఒత్తిడి ఉండదు.