ఈ ఉగాది.. టాలీవుడ్ కు పెద్ద పండుగే

0

మామూలుగా సంక్రాంతికి సినిమాల పండుగ ఉంటుంది. ఈ సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి సంక్రాంతి బరిలో కోడి పుంజుల వలె కొట్టుకున్నాయి.మహేష్ అల్లు అర్జున్ రజినీకాంత్ కళ్యాణ్ రామ్ లాంటి అగ్రహీరోలు సంక్రాంతి హోరాహోరీగా తలపడ్డారు. ఫలితమేదైనా టాలీవుడ్ కు ఎంతో అచ్చొచ్చే సీజన్ సంక్రాంతియే.

ఇక సీజన్ తోపాటు సమ్మర్ కూడా మంచి బిజినెస్ సీజన్. స్కూళ్లకు సెలవులు ఉద్యోగులు టీచర్లు సెలవులు దొరికి ఖాళీగా ఉంటారు. సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్లు గ్యారెంటీ.. కానీ ఈ సమ్మర్ కు పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉన్న ఈ సమ్మర్ సీజన్ లోనే తన ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేశారు. హీరో నానికి కూడా ముందే వచ్చేస్తున్నారు. సమ్మర్ కు పవన్ కళ్యాణ్ సినిమాతో అభిమానులకు ట్రీట్ ఇస్తుండగా.. పెద్ద హీరోలు కూడా సినిమాలతో రాకున్నా ఫస్ట్ లుక్ టైటిల్ లోగోలతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

మార్చి 25న తెలుగువారి కొత్త సంవత్సర పండుగ ఉగాది. ఈ పండుగను పురస్కరించుకొని అభిమానులకు టాలీవుడ్ సరికొత్త ట్రీట్ ఇవ్వబోతోంది. ఉగాదికి అగ్రహీరోలు తమ ఫస్ట్ లుక్ లు టైటిల్ లోగోలు టీజర్ లు రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఉగాది కానుకగా మొదట మార్చి 24 పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రం టీజర్ ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత వస్తున్న పవన్ ఎలా ఉండబోతున్నారు? ఎలా చేస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పుడు పవన్ టీజర్ మేనియా ఉగాదికి బద్దలవ్వడం ఖాయమంటున్నారు.

ఇక సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ కూడా ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ కు ప్లాన్ చేశారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి -కొరటాల మూవీ ‘ఆచార్య’ మూవీ ఫస్ట్ లుక్ కూడా ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.

ఇక అన్నింటికంటే అదిరిపోయే న్యూస్ ఏంటంటే.. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టైటిల్ లోగోను ఉగాదికి రిలీజ్ చేయబోతున్నారట.. ఇది కానీ రిలీజ్ అయితే టాలీవుడ్ యే కాదు బాలీవుడ్ దేశ సినీ పరిశ్రమ అంతా షేక్ కావడం కాయం.

ఇక మార్చి 27 రాంచరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని రాంచరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాట.. అంటే ఈ ఉగాదికి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందబోతుందన్న మాట..

ఇలా ఉగాది పెద్ద హీరోలు దర్శకులు తమ తమ సినిమాల విశేషాలను పంచుకునేందుకు వస్తున్నారు. మరి ఎంజాయ్ చేయడానికి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-