బడా సినిమాల హంగామా మొదలైంది

0

పది చిన్న సినిమాలొచ్చినా ప్రేక్షకుల కళ్ళు మాత్రం స్టార్ల సినిమాపైనే ఉంటాయి. అయితే ఈ ఏడాది ఆడియన్స్ ఎప్పటినుండో తీవ్రంగా ఎదురుచూస్తున్న రెండు బడా సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. అందులో ఒకటి ‘సాహో’ మరొకటి :సైరా నర్సింహ రెడ్డి’. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ వస్తున్న ప్రతిష్టాత్మక సినిమాలే. బాహుబలి తో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోవడానికి ప్రభాస్ కి సాహో బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా ముఖ్యం. అలాగే మెగా స్టార్ కి సైరా కూడా ఎంతో స్పెషల్. ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇక పక్కా మాస్ సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడీ రెండు సినిమాలు ప్రమోషన్స్ తో హంగామా చేస్తూ ఫ్యాన్స్ ని ఊరిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ‘సాహో’ ట్రైలర్ దుమ్ము దులిపేస్తుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెల్తూ మరో వైపు థియేటర్స్ లో కూడా ప్లే అవుతుంది. థియేటర్స్ లో ‘సాహో’ ట్రైలర్ రాగానే ఫ్యాన్స్ ఈలలు కేకలతో థియేటర్ దద్దరిల్లుతోంది. ట్రైలర్ అనుకున్నదానికంటే సినిమాపై ఎక్కువ బజ్ తీసుకొచ్చింది. మరో పదిహేను రోజుల పాటు ‘సాహో’ ట్రైలర్ మేనియా ఉంటుంది. ఇక 30న సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. అప్పటి నుండి సినిమా వసూళ్లతో మళ్లీ హంగామా మొదలవుతుంది.

ప్రస్తుతం ‘సైరా’ మేకింగ్ వీడియో కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అసలే మెగా స్టార్ సినిమా అందులోకి చరిత్రాత్మక సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో ఓటు యావత్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. చిరు జన్మదిన సందర్భంగా ఆగస్ట్ 20న సినిమాకు సంబంధించి మరో టీజర్ వదలనున్నారు. ఆ టీజర్ నుండి సినిమాపై మరింత హైప్ పెరగనుంది. అక్టోబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది. ఇలా సాహో సైరా సినిమాల హంగామాతో టాలీవుడ్ లో ఓ జోష్ కనిపిస్తుంది.
Please Read Disclaimer