వరుణ్ వెనుక కూడా పెద్ద క్యూ నే ఉందే

0

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభం నుండి స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలను మాత్రమే ఈయన చేస్తున్నాడు. హడావుడిగా సినిమాలు చేయాలని వరుణ్ భావించలేదు. అయితే తన పద్దతిని మార్చుకోవాలని వరుణ్ భావిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి సినిమాకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్ ఆ సినిమా ప్రారంభం కాకుండానే మరో సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడట.

వరుణ్ తేజ్ కు ఈమద్య కాలంలో పలువురు దర్శకులు కథలు చెప్పారట. వారిలో ముఖ్యులు సురేందర్ రెడ్డి కాగా మరో దర్శకుడు వక్కంతం వంశీ. వీరిద్దరితో సినిమాలకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరో ఇద్దరు కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేస్తానంటూ హామీ ఇచ్చాడని సమాచారం అందుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో రూపొందబోతున్న ఆ సినిమాను త్వరలో ప్రారంభించబోతున్నారు.

వచ్చే వేసవిలో వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాను వరుణ్ ప్రారంభిస్తాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నా పేరు సూర్య చిత్రం తర్వాత వక్కంతం వంశీ కనిపించకుండా తెర వెనుక ఉండి పోయాడు. మళ్లీ దర్శకత్వం చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈసారి ఒక సింపుల్ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీని వరుణ్ తేజ్ కి వినిపించాడని.. వరుణ్ కూడా ఆ స్టోరీపై ఆసక్తి చూపించాడని అంటున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో కూడా సినిమా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలతో వరుణ్ బిజీగా ఉండబోతున్నాడు.

ఈ ఏడాది ఎఫ్ 2 మరియు గద్దలకొండ గణేష్ చిత్రాలతో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ వచ్చే ఏడాదిలో ఎలాంటి ఫలితాలను చవి చూస్తాడో చూడాలి.
Please Read Disclaimer