సంజయ్ దత్ కి బిగ్ రిలీఫ్ సతీమణితోనే

0

బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జీవితంలో ఉత్థానపతనాల గురించి తెలిసిందే. డ్రగ్స్ వెపన్స్ అంటూ కేసులతో అతడి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ డేస్ జైల్లోనే కరిగిపోయాయి. సరిగ్గా ఆయన జైల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచారు మాన్యత. కష్టంలో అతడి వెంటే నిలిచిన ప్రేమికురాలిగా మాన్యత గురించి బోలెడంత ప్రచారమైంది.

ఇక దత్ జైలు జీవితం విడిచి తిరిగి ఇంటికి చేరుకున్నప్పటి నుంచి మాన్యత పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. ప్రస్తుతం వరుసగా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఊహించని పిడుగులా క్యాన్సర్ మహమ్మారీ దత్ ని వేధించింది. మూడో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ అతడిని తరుముకొచ్చింది.

ఇక మాన్యత దత్ కి ఎంతో సేవలు చేస్తూ ఆయన కోలుకునేలా చేస్తూ ఉత్తమ భార్యగా మెలుగుతోంది. ఆలితోనే అన్నీ.. ఇల్లే స్వర్గం అన్నంతగా దత్ రిలాక్సయిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి. మాన్యత పిల్లలతో సరదాగా గడుపుతూ దత్ చాలా ఊరట చెందుతుంటారు. అన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడి కుటుంబ జీవనంతో ఎంతో మారాడని అంటారు.

ఇక మాన్యత రెగ్యులర్ గా సోషల్ మీడియా పోస్టింగులతో తమ సంసార జీవనంపై అప్ డేట్స్ ఇస్తుంటారు. ఇదిగో ఇలా తరచూ తన అభిమానుల కోసం ఆసక్తికరమైన పోస్టులను పంచుకుంటోంది.
ప్రస్తుతం తన పిల్లలు షహ్రాన్- ఇక్రాలతో కలిసి దుబాయ్ లో ఉన్న సంజయ్ దత్ భార్య మాన్యత తన భర్త పిల్లలతో కొంత విలువైన సమయాన్ని గడుపుతున్నందున ఆ విషయాల్ని వెల్లడిస్తోంది.
ప్రస్తుతం మాన్యత మండే మోటివేషన్ వైరల్ గా దూసుకెళుతోంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ తో విజయవంతంగా పోరాడిన సంజయ్ దత్ ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించినన భారీ యాక్షన్ చిత్రం భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించనున్నారు. ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అజయ్ దేవ్గన్- సంజయ్ దత్- సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యష్ కేజీఎఫ్ లోనూ అధీరా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.