సౌత్ ‘క్వీన్స్’ ఏ ఒక్కరు రావడం లేదు ఏమైంది?

0

బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం సూపర్ హిట్ అవ్వడం తో పాటు అవార్డులు రివార్డులు దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమా కథ యూనివర్శిల్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల సౌత్ లో ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్ చేసేందుకు తమిళ నిర్మాత సిద్దం అయ్యాడు. నాలుగు భాషలకు నలుగురు హీరోయిన్స్ ను నలుగురు దర్శకులను పెట్టి రీమేక్ చేయడం జరిగింది.

దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ రీమేక్ లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ ఏవో కారణాల వల్ల చాలా చాలా ఆలస్యం అయ్యింది. ఏదోలా షూటింగ్ ను పూర్తి చేశారు. విడుదల చేద్దాం అనుకున్న సమయంలో మళ్లీ ఏదో సమస్య మొదలైంది. తమిళ వర్షన్ క్వీన్ కు సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. అయినా కూడా విడుదల చేయడం లేదు. తమిళంలో కాజల్ అగర్వాల్ క్వీన్ గా నటించింది. సెన్సార్ బోర్డు తో ఆమద్య కాజల్ తో పాటు యూనిట్ సభ్యులు గొడవకు దిగిన విషయం తెల్సిందే.

ఇతర భాషల్లో యూ/ఎ ఇచ్చినప్పుడు తమిళ సినిమాకు మాత్రం ఎ ఇవ్వడంతో పాటు చాలా సీన్స్ కు కట్స్ చెప్పడం ఏంటీ అంటూ యూనిట్ సభ్యులు సెన్సార్ బోర్డు తీరుకు వ్యతిరేకంగా రివైజ్ సెన్సార్ కమిటీ ముందుకు వెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఎ నే రావడంతో ఆ ప్రయత్నాలు వదిలేశారట. అయితే సినిమా విడుదల విషయాన్ని కూడా వదిలేశారా లేదంటే ఇంకా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. తమిళ వర్షన్ కు సెన్సార్ సమస్యలు వస్తే తెలుగు.. మలయాళం.. కన్నడ వర్షన్స్ అయినా విడుదల అవ్వొచ్చు కదా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సౌత్ క్వీన్స్ వచ్చేనా అనే అనుమానాు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-