బిగ్ బాస్ ఓవర్ సినిమా సంగతేంటి ?

0

కొందరూ సైమల్టియస్ గా రెండు మూడు పనులు చేయగలరు. కానీ కింగ్ నాగ్ ఇందుకు మినహా అనే చెప్పాలి. ఇటీవలే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించిన నాగ్ ఆ షో సమయంలో సినిమా మీద ఫోకస్ పెట్టలేదు. ‘మన్మథుడు 2’ షూట్ కూడా షో కంటే ముందే ముగించేసాడు.

అయితే ఆ మధ్య రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న నాగ్ ఎందుకో ముందుకు వెళ్లలేకపోయాడు. తమిళ్ లో ధనుష్ సినిమా కూడా ఆగిపోయింది. ఇక ‘బంగార్రాజు’ సంగతి చెప్పనక్కర్లేదు. ఇదిగో ఓపెనింగ్ అదిగో షూటింగ్ అంటూనే అభిమానుల్ని ఊరిస్తున్నాడు.

నిజానికి ఏదైనా ఒక పని చేసే టప్పుడు కొందరు దాని మీదే పూర్తి ఫోకస్ పెడతారు. నాగ్ అలాంటి హీరోనే. అందుకే బిగ్ బాస్ షో కి హోస్ట్ గా పూర్తి న్యాయం చేశాడు. తారక్ నాని బిగ్ బాస్ టైంలో చెరొక సినిమా చేసుకున్నారు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సమయంలో ముంబై వెళ్లి మరీ బిగ్ బాస్ చేసొచ్చాడు. నాని కూడా బిగ్ బాస్ టైంలోనే ‘దేవదాస్’ కంప్లీట్ చేసాడు. మరి నిన్నటితో బిగ్ బాస్ పూర్తయింది. ఇకనైనా నాగ్ సినిమాల మీద ఫోకస్ పెట్టి వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని అనౌన్స్ మెంట్స్ వదులుతాడేమో చూడాలి.
Please Read Disclaimer