బిగ్ బాస్ : మహేష్ ని తిట్టిన పున్నూ రాహుల్ కన్నీళ్లు

0

ఎపిసోడ్లు గడిచేకొద్దీ బిగ్ బాస్ రియాలిటీ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు…అదిరిపోయే టాస్క్ కూడా ఇస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ మెడాలియన్ టాస్క్ జరుగగా అందులో వితికా విన్నర్ గా నిలిచింది. ఇక శనివారం ఎపిసోడ్లో ఒక అదిరిపోయే సాంగ్ కి డ్యాన్స్ వేస్తూ కింగ్ నాగార్జున షోలోకి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే శుక్రవారం ఇంటిలో ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు.

ఎపిసోడ్ ప్రారంభంలో అలీ..బాబా చేత వర్కౌట్స్ చేయించాడు. ఇది చూసి శ్రీముఖి బాబా మీద సెటైర్లు వేసింది. ఒక్కరోజులో వర్కౌట్స్ చేసి సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అయిపోతారా అంటూ కామెడీ చేసింది. నేను నేనులాగానే ఉంటానని చెప్పి బాబా వర్కౌట్స్ కంటిన్యూ చేశాడు. అటు అలీ శివజ్యోతిని బియ్యం బస్తాలా భుజం మీద వేసుకుని వర్కౌట్స్ చేశాడు. దీని తర్వాత వంట గదిలో ఓ సీన్ జరిగింది.

నవరాత్రులు సందర్భంగా నాన్-వెజ్ తిననని మహేష్ చెప్పాడు. కానీ అంతకముందే ఆమ్లెట్ వేసుకుని తిన్నాడు. దీని గురించి పునర్నవి వరుణ్-వితికాలతో చెబుతూ..వాడిని ఏ చెప్పుతో కొట్టాలంటూ నోరు పారేసుకుంది. తినేసి మళ్ళీ తిననని చెబుతున్నాడు స్టుపిడ్ ఫూల్ అంటూ ఫైర్ అయిపోయింది.
ఇక రాత్రి సమయంలో స్మోకింగ్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని రాహుల్ బాధపడుతూ ఉన్నాడు.

ఈలోపు అక్కడకి వచ్చిన బాబా భాస్కర్..ఏమైందిరా అలా కూర్చున్నావ్ అని అడుగగానే ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారని చెబుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ మొదలుపెట్టాడు. దీంతో బాబా రాహుల్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. నువ్ స్ట్రాంగ్ రా నువ్ తోపువి రా..ఏడవకూడదు అంటూ బాబా సర్ది చెప్పాడు. ఒక 5 నిమిషాలు బాబాయ్ సెట్ అవుతా…నేను ఏడ్చినట్లు ఇంట్లో ఎవరికి చెప్పొద్దని బాబాని రిక్వెస్ట్ చేశాడు.
Please Read Disclaimer