టీవీ9లోకి బిగ్ బాస్ శివజ్యోతి?

0

వీ6 తీన్మార్ షో ద్వారా పాపులర్ అయ్యింది ‘సావిత్రి’.. అదే మన శివజ్యోతి. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి తెలుగు రాష్ట్రాల వారందరికీ చిరపరిచితమైంది. వీ6 నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ పూర్తయ్యాక ఆమె ఎందులో చేరుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వీ6లో శివజ్యోతికి తోడుగా ఆమె తమ్ముడి పాత్రలో ఒదిగిన బిత్తిరి సత్తి ఇప్పుడు టీవీ9లో చేరాడు. అతడితోపాటు చేరుతుందని అంతా ఆశించినా చేరలేదు. ఎట్టకేలకు శివజ్యోతి మళ్లీ బుల్లితెరమీదకు వచ్చేసింది..

మాటీవీ నిర్వహించిన బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి శివజ్యోతి తనకు ఎంతో పేరు తెచ్చిన వీ6 తీన్మార్ షోనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా శివజ్యోతి ఎగ్జిట్ కాగానే ఆమె తమ్ముడు పాత్రధారి బిత్తిరి సత్తి కూడా వీ6కు గుడ్ బై చెప్పడం గమనార్హం.

ఇక బిగ్ బాస్ షోలో ‘శివజ్యోతి’ జ్యోతక్కగా ఎమోషనల్ జర్నీ సాగించారు. ప్రతి చిన్న విషయానికి భావోద్వేగానికి గురి అవుతూ నెత్తిన కన్నీళ్ల కుండ పెట్టుకొని జలజలా ఏడ్చేస్తూ అందరి మదిని దోచేశారు. హోస్ట్ హీరో నాగార్జునకు కూడా ఫేవరేట్ అయిపోయారు. బిగ్ బాస్ ద్వారా శివజ్యోతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఫైనల్ చేరకపోయినా ఈమె టాప్ కంటెస్టెంట్ గానే పేరొందింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన బిగ్ బాస్ లో సందడి చేశాక శివజ్యోతి ఏ టీవీల్లో కనిపించడం లేదు.. చేరలేదు.

అయితే వీ6నుంచి బయటకు వచ్చి టీవీ9లో చేరిన బిత్తిరిసత్తి వల్ల ఇప్పుడు ఆశించినంత ప్రయోజనం రాలేదట.. ‘ఇస్మార్ట్ న్యూస్’ పేరిట బిత్తిరి సత్తి కామెడీ పండడం లేదన్న టాక్ ఉంది. వీ6 తీర్మాన్ కంటే కూడా టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ సగం కూడా రేటింగ్ పొందలేకపోతోందట.. దీంతో ఇప్పుడు బిత్తిరి సత్తికి జోడీగా శివజ్యోతిని టీవీ9 తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే బిత్తిరి సత్తితో కలిసి శివజ్యోతి టీవీ9లో సందడి చేయబోతోంది.. ఇస్మార్ట్ న్యూస్ ను విజయవంతం చేయడానికి శివజ్యోతిని తీసుకొస్తోందట టీవీ9 యాజమాన్యం. మరి ఈ అక్కాతమ్ముళ్ల జోడీ టీవీ9 షోలో ఏమేరకు కామెడీ పండిస్తుందనేది వేచిచూడాలి.
Please Read Disclaimer