చెప్పు తెగేలా వాయించేసిన కాంట్రవర్శీ బ్యూటీ

0

బిగ్ బాస్- హిందీ సీజన్-13 వివాదాలతో అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవరిస్తోన్న ఈ రియాలిటీ షో వారంతంలో అంతకంతకు హీటెక్కించేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. నిరంతరం ఏదో ఒక వివాదంతో సీన్ వేడెక్కిపోతోంది. షోలో కంటెస్టెంట్ల మధ్య సయోధ్య కుదర్చడం సల్మాన్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. మొన్నటి వరకూ చెట్టా పట్టాలేసుకుని తిరిగిన విశాల్ ఆదిత్య- మధురిమా మధ్య ఇప్పుడు పచ్చగట్టి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఆ క్రమంలోనే గార్డెన్ లో ఆ ఇద్దరి తగాదా మంటలు పుట్టించింది. విశాల్ కోపంతో మధురిమను నొటికొచ్చినట్టు తిట్టాడు.

అంతటి తో ఆగకుండా నోటికొచ్చిన దుర్భాషలాడాడు. దీంతో ఆవేశానికి లోనైన మధురిమ ఎడమ కాలి చెప్పు తీసుకుని విశాల్ ని ఎడా పెడా వాయించేసింది. దీంతో చెప్పు తెగిపోయింది. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ కూడా విశాల్ ని తిట్టింది. ఆ వైపరీత్యం చూసిన హోస్ట్ సల్మాన్ ఇద్దరిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇద్దరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అక్కడా ఆ ఇద్దరిదీ అదే పంథా. ఒకరిపై ఒరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. విశాల్ మాట్లాడుతూ శారీరక హింసకు పాల్పడే వాళ్లను ఇంట్లోకి అనుమతిస్తారా? అని భాయ్ నే ప్రశ్నించాడు.

అనంతరం మధురిమ తో తో తాను కలిసి ఉండలేనని చెప్పాడు. మధురిమ మాట్లాడుతూ..విశాల్ ని చెప్పుతో కొట్టడం తప్పు అని అతన్ని క్షమాపణలు అడిగింది. విశాల్ తప్పులను కూడా ఎత్తి చూపింది. దీంతో సల్మాన్ ఇద్దరినీ మందలించాడు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే వార్నింగ్ లు ఉండవని హెచ్చరించాడు. అలా గతవారం వివాదాన్ని భాయ్ పరిష్కరించాడు. ఇక తెలుగు బిగ్ బాస్ సిరీస్ లోనూ వివాదాలు ఉన్నా మరీ ఇంతగా అగ్గి రాజేయలేదు. ఇంటి సభ్యులు ఒకరినొకరు తిట్టుకోవడం మామూలుగా లాక్కోవడం లాంటివి కామన్ గా ఉన్నా.. హిందీ వాళ్ల అంత రచ్చ చేయలేదు సుమీ!
Please Read Disclaimer