‘బిగ్ బాస్ 3’ లో జూ.సమంత ట్రీట్

0

సమంతను ఇన్నాళ్లు పెద్ద తెరపైనే చూసే భాగ్యం కలిగింది. ఈసారి బుల్లితెరపైనా ట్రీట్ కి రెడీ అవుతోందట. అయితే ఈ సమంత వేరు. ఇప్పటికే అంతర్జాలంలో జూనియర్ సమంతగా పాపులరైన డబ్ స్మాష్ బ్యూటీ అషు రెడ్డి `బిగ్ బాస్` హౌస్ లో ట్రీటివ్వబోతోందట. అమ్మడికి చివరి నిమిషంలో అందివచ్చిన ఆఫర్ ఇదని తెలుస్తోంది.

నిజానికి ఆదివారం ఉదయం వరకూ జూ.సమంతకు ఈ ఆఫర్ లేదు. ఉన్నట్టుండి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందట. ఇంకేం ఉంది జాక్ పాట్ కొట్టేసింది. అయితే తనకు ఈ ఆఫర్ రావడానికి కారణం ఇదివరకూ ఎంపికైన 15 మంది హౌస్ పార్టిసిపెంట్స్ నుంచి అనూహ్యంగా టీవీ సీరియల్ నటుడు భరణి తప్పుకున్నారని తెలుస్తోంది.

జూ.సమంత గురించి వివరాల్లోకి వెళితే.. తను నటిగా మరీ అంత ఫేమస్ ఏమీ కాదు. వీడియో యాప్ లలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఇంకా రీచబిలిటీ ఏం లేదు. అచ్చం సమంతలా కనిపించడం తనకు ప్లస్ అయ్యింది. ఇక సమంతలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని .. ఆ పెదవులకు.. గడ్డం మార్పిడికి చికిత్స జరిగిందని నెటిజనులు ఇదివరకూ ట్రోల్స్ చేశారు. ఇంకా కనీసం ఒక్క సినిమాలో కూడా అవకాశం లేని ఈ బ్యూటీ అలా చేస్తుందా? అంటూ సమర్థించే కొందరు నెటిజనుల వల్ల ఈ బ్యూటీకి పాపులారిటీ పెరిగింది. తనకు ఎట్టకేలకు జాక్ పాట్ తగిలింది. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కితే వెండితెర ఛాన్సులు వరిస్తాయేమో చూడాలి. డబ్ స్మాష్ లతోనే పాపులరైన దీప్తి సునయన బిగ్ బాస్ సీజన్ 2లో మెరిపించిన సంగతి తెలిసిందే. ఈసారి అదే తరహాలో జూ.సమంత ట్రీట్ ఉంటుందన్నమాట.
Please Read Disclaimer