బిగ్ బాస్: నామినేషన్లో ఐదుగురు…ఈ వారం బయటకు వెళ్ళేదెవరో..!

0

బిగ్బాస్ చివరి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీని తర్వాత ఫినాలేనే ఉంటుంది. అందులో ఐదుగురు సభ్యులు పోటీ పడతారు. ఆదివారం వితికా ఎలిమినేట్ కావడంతో ఇంట్లో మిగిలిన 6 గురు సభ్యులకు నామినేషన్ టాస్క్ ఇచ్చారు. ఈ నామినేషన్ టాస్క్ సోమవారం మంగళవారం ఎపిసోడ్లో కొనసాగింది. ఆరు రౌండ్లుగా ఈ ప్రక్రియ సాగింది. కానీ ఇందులో అలీ గెలిచి ఫినాలేకి వెళ్లతారని అంతా అనుకున్నారు. కానీ అలీ కోపమే తన కొంపముంచింది. ఒక టాస్క్ లో అలీ – బాబా భాస్కర్ పోటీ పడ్డారు.

కానీ అప్పుడు గేమ్ లో భాగంగా అలీ దారుణంగా బాబా పై దాడికి దిగాడు. దీంతో అలీని పోటీ నుంచి తప్పించి డైరెక్ట్ నామినేషన్ లో పెట్టేశాడు బిగ్ బాస్. ఇక మిగిలిన ఐదుగురులో రాహుల్ రెండు సార్లు గెలిచి అందరికంటే టాప్ పొజిషన్ లో ఉండటంతో టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్ -5 లోకి వెళ్లిపోయాడు. ఇక మిగిలిన ఐదుగురు సభ్యులైన శ్రీముఖి – అలీ – బాబా భాస్కర్ – వరుణ్ శివజ్యోతి ఈ వారం ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. అయితే ఈ అయిదుగురులో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి…మిగిలినవారు ఫినాలేకు చేరుకుంటారు.

ప్రస్తుతం ఉన్న పోటీని బట్టి చూస్తుంటే అలీ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది. నామినేషన్ టాస్క్ లో క్రూరంగా ప్రవర్తించడం వల్లే ప్రేక్షకులు అలీని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. పైగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం కూడా మైనస్ కానుంది. మిగిలిన వారు మంచిగానే గేమ్ ఆడుతుండటంతో వారికి మద్ధతు ఇచ్చే అవకాశముంది. ఇక శ్రీముఖి బాబా భాస్కర్ లకు ఓటింగ్ గట్టిగానే వచ్చే అవకాశముంది. వారు తప్పనిసరి ఫినాలేకి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి టాప్-5 కి ఎవరు వెళతారో?…హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో?
Please Read Disclaimer