హేమ కి సరదా పంచ్ – తమన్నా ని మెచ్చుకున్నాడు!

0

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఘట్టం జరిగింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. అందరూ విన్నర్ ఎవరా అనే అతృతతో షోను తిలకించారు. అయితే గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా స్టార్ కంటెస్టెంట్స్ తో మాట్లాడిన మాత్రం హైలైట్ గా నిలిచాయి.

అందరినీ పేర్లతో వారి వృత్తిలను గుర్తుచేసుకుంటూ పలకరించిన మెగా స్టార్ హేమను సరదాగా ఆట పట్టించాడు. తమ అభిమాన హీరోలిద్దరినీ ఒకే సారి ఇలా చూడటం ఎంతో ఆనందంగా ఉందని హేమ అనగానే వెంటనే నాకు తెలుసులే నా మీద ఏదో గౌరవంతో అలా అన్నావ్ కానీ నా కన్నా నీకు నాగ్ అంటేనే అభిమానం ఎక్కువ హీ -హు – హే అంటూ దీర్గాలు తీసాడు. దానికి హేమ ఏం మాట్లాడా తెలియక కూర్చుండి పోయింది.

అయితే మరో వైపు తమన్నాను కూడా ఓ విషయంలో ఇండైరెక్ట్ మెచ్చుకున్నారు చిరు. ఎవరైనా మంచి మనుషుల గురించి మాట్లాడితే ఫ్రెండ్ షిప్ వదులుకొని మరీ డేర్ గా మాట్లాడతావ్ అంటూ తెగ మెచ్చుకున్నారు. అంటే కాదు నేను దీని గురించి ఇదంతా ఎందుకు చెప్పానో నీకు నాకు మాత్రమే తెలుసు అన్నాడు. ఇక అలా మాట్లాడటానికి రీజన్ పవన్ -శ్రీ రెడ్డి విషయమే అని ఆల్మోస్ట్ హింట్ ఇచ్చారు. సంబంధం లేని విషయంలో పవన్ ని లాగి అతని తల్లి ని తిట్టడం అప్పట్లో దుమారం లేపింది. ఆ సమయంలో తమన్నా శ్రీ రెడ్డి ఫ్రెండ్ షిప్ వదులుకొని ఆ ట్రాక్ నుండి పక్కకు తప్పుకుంది. ఆ విషయాన్నే మరో సారి మెగా స్టార్ బిగ్ బాస్ లో గుర్తుచేసుకొని తమన్నా ని అభికమందించి ఉండరేమో.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home