బిగ్ బాస్ 3.. ఆ 14 మంది వీరే?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సీజన్ 3 కి నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఈసారి స్వయంగా తానే రంగంలోకి దిగబోతున్నట్లుగా నాగార్జున ప్రోమోలో చెప్పడంతో ఈ సీజన్పై ఆసక్తి పెరిగింది. జులై రెండవ వారంలో సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే 14 మంది పార్టిసిపెంట్స్ విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనబోతున్న 14 మంది వీరే అంటూ ఒక జాబితా తెగ వైరల్ అవుతుంది.

వీరే ఆ 14 మంది..

1. హీరో తరుణ్
2. ఉధయ భాను
3. సింగర్ హేమ చంద్ర
4. యాంకర్ శ్రీముఖి
5. యాంకర్ లాస్య
6. తీన్మార్ సావిత్రి(జ్యోతి)
7. శ్రీరెడ్డి
8. వైవా హర్ష
9. కేఏపాల్
10. మహాతల్లి జాహ్నవి
11. రఘు మాస్టర్
12. సింగర్ రాహుల్
13. వరుణ్ సందేశ్
14. కామన్మన్.

ఈ జాబితలో ఉన్న వారు ఎక్కువ శాతం సీజన్ 3 లో ఉండే అవకాశం అయితే ఉంది. కాని ఇదే ఫైన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే లాస్య తాను ఇటీవలే డెలవరీ అయిన కారణంగా ఈ సీజన్లో పాల్గొనలేనని చెప్పేసింది. అవకాశం ఉంటే భవిష్యత్తులో తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక కేఏపాల్ బిగ్బాస్ లోకి వెళ్లడం పుకార్లే అయ్యి ఉంటాయి అంటున్నారు. ఆయన క్రైస్తవ మత బోధకుడు. ఆయన దేశ విదేశాలు తిరిగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి బిగ్బాస్లో ఉండటం అనుమానమే అంటున్నారు.

ఇక ఈసారి కామన్ మన్ ఉంటాడనే ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పటి వరకు ఆడిషన్స్ అయితే ఏం జరగలేదు కనుక కామన్ మన్ ఉండక పోవచ్చు. ఇందులోని మరో ముగ్గురు నలుగురు కూడా అనుమానంగానే ఉంది. అసలు లిస్ట్ షో ప్రారంభం అయిన రోజు బయటకు రానుంది.
Please Read Disclaimer