బిగ్ బాస్-3 సాధించిన రికార్డును చెప్పిన నాగ్!

0

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్-3 నిన్న రాత్రి ప్రారంభ ఎపిసోడ్ టెలికాస్ట్ కావటం తెలిసిందే. కింగ్ నాగార్జున ప్రయోక్తగా వ్యవహరించిన ఈ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో వీక్షకుల అటెన్షన్ పే చేసిందన్న విషయాన్ని వెల్లడించారు నాగ్. ఈ సీజన్ కు ఎంపికైన 15 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన నాగ్.. హుషారైన యాంకరింగ్ తో అందరిని అలరించారు.

బిగ్ బాస్ సీజన్ త్రీ తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాన్నివెల్లడించారు నాగార్జున. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. గత రాత్రి.. ప్రపంచంలోనే బిగ్ బాస్ తెలుగు ప్రారంభ ఎపిసోడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమం మీద ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఎపిసోడ్ లో కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పరిచయం చేసి (వరుణ్ సందేశ్ జంటను మినహాయించి) హౌస్ లోకి పంపిన ఎపిసోడ్ ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్ గా నిలవటం విశేషమైతే.. ఎంట్రీనే ఇంత గ్రాండ్ గా ఉంటే.. రానున్న రోజుల్లో మరెన్నిరికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూడాలి.
Please Read Disclaimer