బిగ్ బాస్: సన్ డే బోరింగ్ డే..ప్రేక్షకుల సహనానికి పరీక్ష

0

సన్ డే ఫన్ డే అని చెప్పి ప్రతి ఆదివారం కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చి ఇంటి సభ్యుల చేత సరదా టాస్కులు చేయిస్తారు. అయితే కొన్ని ఆదివారం ఎపిసోడ్లు బాగానే ఫన్ పంచాయి. కానీ ఈ ఆదివారం మాత్రం ప్రేక్షకులకు ఫుల్ బోర్ కొట్టించారు. ఎప్పటిలాగానే ఓ మంచి సాంగ్ తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించారు. నెక్ట్స్ వారి చేత ఏదో సరికొత్త సరదా టాస్కులు ఇస్తారు అనుకుంటే…బోరు కొట్టే విధంగా కంటెస్టంట్స్ కు నచ్చిన పాటకు డ్యాన్స్ చేయాలని చెప్పారు.

ఈ టాస్క్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పైగా మళ్ళీ ఆ డ్యాన్స్ కు మార్కులు కూడా వేశారు. ఇక టాస్క్ మొదలవ్వడమే ఇంట్లో ఉన్న 7 గురు సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి డ్యాన్స్ చేశారు. అసలు ఈ కార్యక్రమం మరి బోరుగా సాగింది. ఎవరికి తోచిన పాటకు వారు డ్యాన్సులు వేశారు. అయితే కొరియోగ్రాఫర్ కావడం వల్ల బాబా భాస్కర్ తన డ్యాన్స్ తో మెప్పించగా – శివజ్యోతి కూడా పర్వాలేదనిపించింది. ఇక మిగతా వారు అలా అలా బండి లాగించేశారు. ఇందులో శివజ్యోతికి ఎక్కువ మార్కులు రాగా… రెండో ప్లేస్ లో బాబా భాస్కర్ ఉన్నారు.

దీని తర్వాత ఇంటి సభ్యులకు కళ్లకు గంతలు కట్టించి – గేమ్ ఆడిచారు. ఇది పెద్ద ఆసక్తికరంగా ఏమి సాగలేదు. అసలు వీటి బదులు ఏమైనా సరదా స్కిట్లు వేయించినా బాగుండేదేమో. అయితే ఎలిమినేషన్ కార్యక్రమం ఉండటం వల్లే ప్రేక్షకులు చివరివరకు చూడగలిగారు గానీ లేదంటే – టీవీలు ఆఫ్ అయిపోయేయి. అసలు సరదా టాస్క్ లు అని చెప్పి ప్రేక్షకులకు ఫుల్ బోర్ కొట్టించారు. ఇక ఈ వారం నామినేషన్ ఉన్న వితికా ఎలిమినేట్ అయింది. దీంతో ఇంట్లో ఆరుగురు సభ్యులు మిగిలారు.