బిగ్ బాస్ పడుకున్నాడు…కంటెస్టెంట్స్ ఫుల్ కామెడీ

0

ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టంట్స్ శుక్రవారం ఎపిసోడ్ లో మరింత ఎంటర్ టైన్ మెంట్ అందించారు. బిగ్ బాస్ ఇచ్చిన ఓ సరికొత్త టాస్క్ ఇంటిలో మస్తు వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ అలిసిపోయి – నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ఇంటి సభ్యులు ఎవరు తన నిద్రని డిస్ట్రబ్ చేయకూడదని కండిషన్ పెట్టాడు. ఒకవేళ తన నిద్రని చెడగొడితే…కంటెస్టంట్స్ నిద్రపోయే సమయంలో వారి నిద్రని చెడగొడతాని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు.

అయితే బిగ్ బాస్ అలా చెప్పేసే వదిలేయడుగా – ఏదొక లింకు పెడతాడుగా. తాను నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులకు సరదా టాస్క్ లు ఇచ్చారు. ఆ టాస్క్ లో భాగంగా శ్రీముఖి అరవకుండా అలీ వీపు మీద ఎక్కి 20 రౌండ్లు వేయాలి. బాబా భాస్కర్ కాళ్ళు – చేతులు మీదున్న జుట్టు పీక్కోవాలి. వితికా – రాహుల్ బెలూన్ లకు షేవింగ్ క్రీమ్ రాసి..వాటికి షేవ్ చేయాలి. ఇక మహేష్ నెత్తి మీద ప్లేట్ పట్టుకుని – దాన్ని చేతులతో పట్టుకోకుండా గోడ కుర్చీ వేయాలి. వరుణ్ – శివజ్యోతిలకు మిగతా ఇంటి సభ్యులు కితకితలు పెట్టాల్సి ఉంటుంది.

టాస్క్ మొదలవ్వగానే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. శ్రీముఖి – అలీలు కలిసి 20 రౌండ్లు కొట్టేశారు. పాపం బాబా భాస్కర్ చేతులు – కాళ్ళ మీద జుట్టు లాక్కుంటూ…నొప్పి ఉన్న సైలెంట్ గానే ఉన్నారు. అటు మహేష్ చాలా కష్టంగా గోడ కుర్చీ వేశాడు. ప్లేట్ మాత్రం పడుతూనే ఉంది. రాహుల్ – వితికాలు బెలూన్ లకు షేవ్ చేశారు. ఇక వరుణ్ – శివజ్యోతిలకు ఓ రేంజ్ లో కితకితలు పెట్టారు. శివజ్యోతి అయితే ఆ కితకితలకు కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఓ నవ్వేసింది. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ వల్ల కంటెస్టంట్స్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించారు
Please Read Disclaimer