బిగ్ బాస్: ఆరోవారం ఎలిమినేషన్ జోన్లో ఆరుగురు

0

బిగ్ బాస్ విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఈ ఐదువారాల్లో ఐదుగురు సభ్యులు ఇంటి నుంచి బయటకెళ్లగా హౌస్ లో 11 మంది మిగిలారు. ఇక ఈ 11 మందికి సంబంధించిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. గత వారాలకు భిన్నంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియని బిగ్ బాస్ ప్రారంభించాడు. మొదట కెప్టెన్ శివజ్యోతి మినహా 10 మంది సభ్యులు తమకు నచ్చిన వ్యక్తితో కలిసి పెయిర్ గా ఏర్పడాలని కోరారు.

దీంతో శ్రీముఖి-హిమజ – బాబా భాస్కర్-మహేశ్ – అలీ-రవి – పునర్నవి-వరుణ్ – రాహుల్-వితికలు జంటలుగా ఏర్పడ్డారు. ఈ జోడిల్లో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలని మిగతా ఇంటి సభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో మొదట జోడీగా వచ్చిన పునర్నవి-వరుణ్ లలో ఎక్కువ మంది ఇంటి సభ్యులు పునర్నవిని నామినేట్ చేశారు. అలాగే తర్వాత అలీ-రవి జోడీలో రవిని నామినేట్ చేయగా – బాబా భాస్కర్-మహేశ్ జోడీలో మహేశ్ ని ఎక్కువ నామినేట్ చేశారు.

ఆ తర్వాత శ్రీముఖి-హిమజ జోడీలో హిమజని నామినేట్ చేశారు. ఇక రాహుల్-వితికల జోడీకి సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో కెప్టెన్ శివజ్యోతి చేతికి నిర్ణయం వెళ్ళగా ఆమె రాహుల్ ని నామినేట్ చేసింది. మొత్తాని ఈ ప్రక్రియ ద్వారా పునర్నవి – రవి – మహేశ్ – హిమజ – రాహుల్ లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

అయితే సేవ్ అయిన మిగతా ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ శివజ్యోతిని కోరాడు. దీంతో ఆమె వరుణ్ ని నామినేట్ చేసింది. ఇలా ఆరో వారంలో ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చారు. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎవరు బయటకెళ్తారో చూడాలి.
Please Read Disclaimer