Templates by BIGtheme NET
Home >> Cinema News >> Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సందడి షురూ.. ప్రారంభం ఎప్పుడంటే? ప్రోమో వైరల్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సందడి షురూ.. ప్రారంభం ఎప్పుడంటే? ప్రోమో వైరల్


Bigg Boss 6 Telugu: ఒక పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు కారులో తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. పెళ్లి కూతురు మాత్రం తల్లిదండ్రుల వద్ద బోరుమంటూ ఏడుస్తోంది. కన్నవారిని వదిలి వెళ్లలేక కన్నీరు పెడుతోంది. అంతలోనే పెళ్లి కూతురు తల్లికి ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ‘బిగ్ బాస్ 6’ షో రన్ అవుతుంటుంది. అంతా ఖాళీ.. ఏడుస్తున్న పెళ్లి కూతురును వదిలేసి మరీ.. అప్పగింతలు అయ్యే వరకూ కూడా తల్లిదండ్రులు ఆగలేదంటే అది ‘బిగ్ బాస్ ఆట మొదలైనట్టే’.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ దానికి అంత ప్రాధాన్యమిచ్చేలా ప్రకటన వీడియో విడుదలైంది.. వైరల్ అవుతోంది…

ఇలా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ‘బిగ్ బాస్6’ లాంచ్ అయ్యింది. స్టార్ మాలో త్వరలోనే ఈ వరల్డ్ నెంబర్ 1 రియాలిటీ షోను లాంచ్ చేయడానికి తేదీ ఫిక్స్ అయ్యింది. తెలుగులో ఎంతో హిట్ అయిన ఈ షో కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇది ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం వివాదమే.. సీపీఐ నారాయణ లాంటి వారు బిగ్ బాస్ ను బ్రోతల్ హౌస్ అనేశారు. హోస్ట్ నాగార్జున మరీ తిట్టిపోశారు. అయినా కూడా ప్రేక్షకులు ఈ షోను బ్రహ్మరథం పట్టి టాప్ లో నిలిపారు.

అందుకే ఏది ఆగినా..ఆగకపోయినా కూడా బిగ్ బాస్ ఆట మాత్రం ప్రతీ సంవత్సరం ఆడుతూనే ఉంటుంది. ఆ వివాదాలతోనే ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ ముందుకెళుతోంది.

ఈ సంవత్సరం కూడా మరోసారి బిగ్ బాస్ 6 మొదలుకాబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. బిగ్ బాస్ 6కు నాగార్జుననే హోస్ట్ గా చేయబోతున్నారు. ఈ దఫా సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లను కుదించినట్టు తెలిసింది. గతంలో 16 నుంచి 17వరకూ తీసుకుంటే ఈసారి షోలో కేవలం 12 లేదా 13 మందిని మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆ 13 మంది కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయ్యిందట.. వీరిని కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 25న క్వారంటైన్ కు రెడీగా ఉండాలని సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

ఇక బిగ్ బాస్ 6 షోను సెప్టెంబర్ 3 లేదా 4 వ తేదీన లాంచ్ చేయడాలని డేట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. దీంతో మరో మూడు నెలల పాటు బుల్లితెరపై సందడి కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

బిగ్ బాస్ మొదలైతే అందులోని రచ్చ ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో రాజుకుంటుంది. ఆ షో హంగామాతో అందరికి ఫుల్ సందడి నెలకొనడం ఖాయం.