బిగ్ బాస్ పుల్లలు: వితిక-పునర్నవి మధ్య చిచ్చు..

0

బిగ్ బాస్ ఏ సమయంలో ఏం చేస్తాడో ఎవరికి అర్ధం కాదు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య సఖ్యత పెంచగలడు అలాగే గొడవ పెట్టగలడు. శుక్రవారం ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య పుల్లలు గట్టిగానే పెట్టాడు. మొదట వంటగదిలో బాబా భాస్కర్ – శ్రీముఖి – అషు – శివజ్యోతి మధ్య కామెడీ ట్రాక్ నడిచింది. దీని తర్వాత బిగ్ బాస్ పునర్నవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు.

ఈ సందర్భంగా వితిక – రాహుల్ లు సీక్రెట్ గా పునర్నవి గురించి మాట్లాడుకున్న వీడియోని ప్లే చేశాడు. అందులో వితిక పునర్నవిని ఘాటుగానే విమర్శించింది. ఆ తర్వాత వరుణ్ తో కూడా వితిక పున్ను గురించి చెబుతున్నా వీడియోని ప్లే చేశాడు. ఇక ఇవి చూసి బయటకొచ్చిన పునర్నవి వీళ్లు నా గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటూ ఫీల్ అయ్యింది. వితికాతో డైరెక్ట్ గానే పోట్లాడిన పునర్నవి.. రాహుల్ వద్ద తన బాధను వెళ్లగక్కింది.

ఇక పునర్నవి తర్వాత శ్రీముఖి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లింది. ఆమెకోసం పునర్నవి – రాహుల్ – వితికాలు ఎలా గుసగుసలాడారో వీడియో ప్లే చూసి చూపించారు. దీని తర్వాత బయటకొచ్చి ఫీల్ అవుతూ ఆ వీడియో గురించి చెప్పింది. ‘నీ గురించి నేను వెనుక మాట్లాడానని సారీ చెప్పింది పునర్నవి. ఆ తరవాత అలీ రూమ్ కి వెళ్ళాడు. అతని గురించి హిమజ శ్రీముఖితో మాట్లాడుతున్న వీడియోని ప్లే చేశారు.

అలాగే అలీ బాబా భాస్కర్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేసిన తర్వాత బాబా శ్రీముఖి దగ్గర కన్నీరు పెట్టుకున్న వీడియోని ప్లే చేశారు. అలీ మంచోడే నేనేమీ తప్పు చేశాను అంటూ బాబా శ్రీముఖి దగ్గర పిల్లాడిలా ఏడుస్తారు. ఇది చూసి బయటకొచ్చిన అలీ బాబాకి సారీ చెప్పి హగ్ చేసుకుంటాడు. బాబా కూడా ఏం కాదురా అంటూ సముదాయించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి అలా బిగ్ బాస్ వీడియోలు ప్లే చేసి ఇంటి సభ్యులు మధ్య సఖ్యత పెంచుతూనే పుల్లలు పెట్టారు.
Please Read Disclaimer