అనసూయ ప్లేస్‌లో శ్రీముఖి.. ‘జబర్దస్త్’ ట్విస్ట్!

0

బుల్లితెరపై లెక్కలు మారుతున్నాయి. వాళ్లు వీళ్లు అవుతున్నారు.. వీళ్లు వాళ్లు అవుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ టీఆర్పీ రేటింగ్‌లో టాప్ అనిపించుకునేందుకు ఛానల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ఇదివరకూ పోటీ పడటం అంటే క్రియేటివిటీని జోడించి.. తమకు పోటీగా ఉన్న ప్రోగ్రామ్‌ను కొట్టేలా కొత్త ప్రణాళికలను రచించేవారు.

అయితే ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన కాంపిటేషన్ ఉండటంతో వీలైతే తొక్కడానికి కుదరకపోతే ‘రేటింగ్‌కి రేటు’ అనే కొత్త పథకానికి తెరతీశారు. అంటే.. ఏదైతే టాప్ రేటింగ్ ఉందో ఆ షోలో పనిచేస్తున్న టాప్ కంటెస్టెంట్లను, జడ్జ్‌లను భారీ రేటు పెట్టి తమ షోలకు తీసుకురావడం అన్నమాట. అంటే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు మాదిరే బుల్లితెరపై రేటింగ్ వేటను ఈ రకంగా మొదలుపెట్టారు.

అసలు విషయానికి వస్తే.. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జబర్దస్త్ పకపకలు గత ఏడేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. రోజా, నాగబాబులు ఈ షోకి జడ్జ్‌లుగా వ్యవహరిస్తుండగా.. జబర్దస్త్ షోకి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌కి రష్మిలు ఈటీవీకి ఆస్థాన యాంకర్లుగా సేవలందిస్తున్నారు.

ఈ జబర్దస్త్‌ ద్వారా షకలక శంకర్, హైపర్ ఆది, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రైజింగ్ రాజు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాం ప్రసాద్ ఇలా డజన్ల కొద్దీ కమెడియన్స్ లైఫ్ గాడిన పడింది. అయితే ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో కళ తప్పబోతుంది.

జబర్దస్త్ కామెడీ షోకి ధీటుగా.. జీ తెలుగు ‘గ్యాంగ్‌ స్టార్స్‌’ అనే ప్రోగ్రామ్‌ను భారీ ఎత్తున ప్రారంభించనుంది. అయితే ఈ షో కోసం జబర్దస్త్ యాంకర్ అనసూయతో పాటు.. జడ్జ్ నాగబాబు, హైపర్ ఆదిలను సైతం ఇప్పటికే లాగేసిందట జీ తెలుగు. వీరితో పాటుగా సుడిగాలి సుధీర్, ప్రదీప్‌లను జీ తెలుగు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువస్తున్నారు. రవి, సుధీర్, హైపర్ ఆదిలో ముగ్గురూ ఈ షో‌కు హోస్ట్ చేయబోతున్నారు. ఇక అనసూయను కూడా యాంకర్‌గా రంగంలోకి దించబోతున్నారట.

అయితే అనసూయ జబర్దస్త్ నుండి ఔట్ కాగానే.. ఆమె స్థానంలో శ్రీముఖి రంగంలోకి దించబోతున్నారట మల్లెమాల యూనిట్. అయితే గతంలో ఈటీవీ ‘పటాస్’ షో నుండి అర్ధాంతరంగా తప్పుకుని స్టార్ మా వారి బిగ్ బాస్‌కి వెళ్లిన శ్రీముఖిని మళ్లీ ఈటీవీలోకి తీసుకురావడం అనుమానంగానే అనిపిస్తోంది. అయితే అనసూయ ప్లేస్‌ను భర్తీ చేయాలంటే.. మళ్లీ రేటింగ్‌ను ఆ స్థాయిలో దున్నుకోవాలంటే రంగమ్మత్త ప్లేస్‌లో రాములమ్మ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. అందుకే ‘పటాస్’ అనిపించిన శ్రీముఖితో జబర్దస్త్ కామెడీ చేయించబోతున్నారట.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత శ్రీముఖి త్వరలో స్టార్ మాలో ఓ కొత్త షోతో సందడి చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనతో పాటు ప్రోమో కూడా విడుదల చేసింది స్టార్ మా. ఇందులో బిగ్ బాస్ షో మాదిరే అరుపులతో రచ్చ రచ్చ చేస్తుంది శ్రీముఖి. కాగా శ్రీముఖి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు భారీ హంగామాతో స్టార్ మా ఈ షోను ప్లాన్ చేసింది. ఈ షోను చేస్తూనే శ్రీముఖి జబర్దస్త్ వైపుకు వెళ్తుందా? రెండు షోలను ఎలా మేనేజ్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
Please Read Disclaimer