దెయ్యాలుగా మారిన బిగ్ బాస్ హౌస్ మేట్స్…

0

ఎపిసోడ్లు గడిచేకొద్దీ బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ కంటే ముందు సోమవారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్ రవిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి మంగళవారం ఎపిసోడ్ మొదట్లో బాబా – శ్రీముఖిల మధ్య చర్చ నడిచింది.

రవిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడం తనకు షాక్ గా అనిపించలేదు కానీ..మీరు వచ్చి బాధపడుతున్నావా? అంటేనే ఫీల్ అయ్యానని బాబాతో శ్రీముఖి చెప్పి ఎమోషనల్ అయ్యింది. దీనికి బాబా కూడా తాను అలా చేసి ఉండకూడదని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. వీరి చర్చ తర్వాత బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు.

ఇందులో ఐదు దెయ్యాలుగా బాబా భాస్కర్ – హిమజ – రాహుల్ – శిల్ప – వితికాలు ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్ – శ్రీముఖి – పునర్నవి – శివజ్యోతి – రవి – మహేష్ లకు విసుగుతెప్పించాలి. దెయ్యపు చేష్టలతో వాళ్ళని స్పందించేలా చేయాలి. అలాగే ఈ టాస్క్ లో భాగంగా తొలిరోజు ముగ్గురు మనుషులని చంపితే ముగ్గురు దెయ్యాలు మనషులుగా మారుతారు.

అలా జరగాలంటే మొదటిగా వరుణ్ కి వితికా మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్ పై వరుణ్ గోస్ట్ అని రాయాలని – శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేయాలి. మూడ్ టాస్కులు తర్వాత రవిని డాన్స్ వేసేట్టు చేయాలని – మహేష్ ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు టాస్క్ లు ఇచ్చారు.
Please Read Disclaimer