కంటెస్టెంట్లకు తొలిరోజే బిగ్ బాస్ షాక్..!

0

ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్-3 స్టార్ట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఈ సీజన్ కు ముందే..కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో వివాదాలు చోటు చేసుకోవటమే కాదు.. కేసుల వరకూ వెళ్లటం తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ షోను చేయకూడదన్న ఓయూ విద్యార్థి సంఘాల హెచ్చరికల నడుమ ఎట్టకేలకు అనుకున్న సమయానికి బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది.

సీజన్ 2లో కంటెస్టెంట్ అయిన నూతన్ నాయుడు సోషల్ మీడియాలో విడుదల చేసిన జాబితానే నిజం కావటంతో.. కంటెస్టెంట్లు ఎవరన్న విషయంపై ఆసక్తి వ్యక్తం కాలేదు. హౌస్ లోకి పంపే తొలి ముగ్గురిని చిట్టీల ద్వారా ఎంపిక చేసి.. తొలుత వారిని స్టేజ్ మీదకు పిలిపించారు.

మొత్తం 15 మందిని హౌస్ లోకి వెళ్లిన తర్వాత.. కంటెస్టెంట్లను కూర్చొబెట్టిన బిగ్ బాస్ కొందరి పేర్లను నామినేట్ అవుతున్నట్లు ప్రకటించిన వైనం షాకింగ్ గా మారింది. హౌస్ లోకి అడుగు పెట్టారో లేదో.. నామినేట్ అయినట్లుగా ప్రకటించిన వైనం షాకిచ్చేలా ఉంది.అయితే.. ఈ నామినేషన్ ఎలిమినేషన్ కోసమా.. కెప్టెన్ టాస్క్ కోసమా? అన్నది తేలాలంటే ఈ రోజు ప్రసారమయ్యే షోను చూస్తే కానీ తేలనుంది. సాదాసీదాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో చివర్లో మాత్రం.. ఊహించని ఝులక్ ఇవ్వటం మాత్రం.. ఆసక్తిని రేపిందని చెప్పకతప్పదు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home