బిగ్ బాస్ లో దొంగలు దోచిన నగరం..ఆడ – మగ తన్నుకున్నారుగా…

0

హౌస్ లో ఎలాంటి హింసకు తావులేదని పెద్ద క్లాస్ తీసుకునే బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు కొట్టుకునేలా చేశాడు. దొంగలు దోచిన నగరం టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులని రెండు గ్రూపులుగా విభజించి తన్నుకునేలా చేశాడు. ఈ టాస్క్ కంటే ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కొన్ని వస్తువులని పట్టుకుపోయారు. ఇంటి సభ్యులు కొందరిని అడ్డుకుని వస్తువులని తిరిగి లాక్కున్నారు. ఇక ఈ ఘటన తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ దొంగలు దోచిన నగరం టాస్క్ ఇచ్చాడు.

దొంగలు ముఠా – నగర వాసులు అని కంటెస్టెంట్స్ ను రెండు గ్రూపులుగా విడగొట్టి తన్నుకునేలా చేశాడు. ఇక దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు. అలాగే మిగతా దొంగలుగా పునర్నవి – శివజ్యోతి – రాహుల్ – వరుణ్ – రవిలు ఉన్నారు. అటు నగర వాసులుగా శ్రీముఖి – బాబా భాస్కర్ – అలీ – మహేశ్ – హిమజ – వితికలు ఉన్నారు. నగరవాసులు దొంగలు దోచుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవాలి. ఇక ఆట మొదలయ్యాక అసలు రచ్చ మొదలైంది. ఆడ – మగ అని చూసుకోకుండా ఒకరిమీద ఒకరు దాడి చేసుకున్నారు.

ఒకరిపై ఒకరు దూషించుకుని బలప్రదర్శనకు దిగారు. హౌస్ మొత్తం గందరగోళం సృష్టించారు. ఇంత దారుణమైన టాస్క్ ఇచ్చి మధ్యలో బిగ్ బాస్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంటిలో హింస జరగకూడదని. అసలు టాస్క్ అనేదే బలప్రదర్శనకు సంబంధించింది. అలాంటప్పుడు హింస జరగకూడదని బిగ్ బాస్ సోది చెప్పాడు. దీని తర్వాత గేమ్ మొదలుపెట్టిన ఇంటి సభ్యులు మళ్ళీ ఇంకా ఎక్కువ స్థాయిలో రచ్చ చేశారు.

ఒకానొక సమయంలో అలీ-రాహుల్ ఒకర్నొకరు నెట్టుకోగా – శ్రీముఖి-పునర్నవి గట్టిగా అరుచుకుంటూ కొట్టుకునేంత పని చేశారు. అలాగే భార్యాభర్తలు వరుణ్-వితిక కూడా వాగ్వాదానికి దిగారు. ఇలా ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు దాడులకు దిగారు. ఇక ఈ టాస్క్ బుధవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది. ఈ రోజు ఎంత రచ్చ జరుగుతుందో ? చూడాలి.
Please Read Disclaimer