బిగ్ బాస్: చిచ్చాకు కలిసొచ్చిందేంటి…

0

బిగ్ బాస్ సీజన్-3లో ప్రేమజంటగా పునర్నవి-రాహుల్ (చిచ్చా) లు బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. వీరు హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందింది. అయితే పునర్నవి ఎప్పుడైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందో…అప్పటి నుంచో రాహుల్ లో గేమర్ బయటకొచ్చినట్లు కనిపిస్తోంది. పున్నూ ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి రాహుల్ గేమ్ మీద బాగా దృష్టి పెట్టారు.

అంతకముందు పున్నూ ఉన్నప్పుడూ రాహుల్…ఆమె చుట్టూనే తిరిగేవాడు. ఓ పులిహోర కలుపుతూ ఆమె చెప్పింది చేస్తూ ఉండేవాడు. మొత్తం పున్నూ మీద ఫోకస్ పెట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టలేదు. ఎంతసేపు ఆమెతో ప్రేమగా మాట్లాడటమో లేక గిల్లికజ్జాలు పెట్టుకోవడమో చేశాడు. అసలు టాస్క్ లు పెద్దగా ఆడేవాడు కాదు. అన్ని లైట్ తీసుకునే వాడు. కానీ ఎప్పుడైతే ఆమె ఎలిమినేట్ అయిందో..అప్పుడు రెండు మూడు రోజులు బాధపడిన తర్వాత గేమ్ లోకి వచ్చేశాడు.

పైగా రాహుల్ తల్లి హౌస్ లోకి వచ్చి మంచి సూచనలు చేసింది. టాస్క్ లు బాగా ఆడాలి నాన్నా అంటూ ఆమె చెప్పేసరికి రాహుల్ మారినట్లు కనిపించాడు. తాజాగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో టాస్క్లు అదరగొట్టి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అందరికంటే ముందు ఫినాలేకు చేరుకున్నాడు. దీంతో చిచ్చా ఫ్యాన్స్ పిచ్చ సంబరాలు చేసుకుంటున్నారు.

నామినేషన్లో ఇచ్చిన టాస్క్లలో వరుణ్ శ్రీముఖిలని ఓడించి సత్తా చాటాడు. పైగా టాస్క్ లో ముందున్న అలీ డిస్ క్వాలిఫై కావడం కూడా రాహుల్కు కలిసొచ్చింది. మొత్తానికి రాహుల్ నిదానంగానే రేసు మొదలు పెట్టిన…అందరికంటే ముందుగా ఫినాలేకు చేరుకున్నాడు. ఏదేమైనా పునర్నవి ఎలిమినేట్ కావడం రాహుల్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.