బిగ్ బాస్ 3: నా పెళ్లాన్ని అంత మాట అంటావా? మహేష్‌తో వరుణ్ కొట్లాట

0

తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్‌లో 6 కంటెస్టెంట్స్ ఉండటంతో రంజుగా మొదలైంది గురువారం నాటి బిగ్ బాస్. షో ప్రారంభంలోనే హేమ, రాహుల్‌ల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించగా.. మేం తగ్గేదే లేదనేశారు ఈ ఇద్దరూ.

రేపు నాగార్జున వస్తారుగా అప్పుడే తేల్చుకుందాం అని హేమ అనడంతో.. పక్కనే ఉన్న మహేష్ విట్టా కల్పించుకుని ఆయన లెవల్ ఏంటి? మన ఈ పత్తి యాపారం ఏంటి? అని అదిరిపోయే టైమింగ్‌తో హేమ నోరెళ్లబెట్టేలా చేశాడు.

మరోవైపు నా చపాతి ముక్క సగం తినేశారు అంటూ సిల్లీ చర్చకు తెరతీసింది పునర్నవి భూపాలం. నా చపాతీని ముక్కను అలీ రజా సగం తినేశారు.. ఇంత సిల్లీగా వ్యవహరిస్తారేంటి? అంటూ రచ్చ చేసింది పునర్నవి. కంటెస్టెంట్స్ మొత్తం అలీ రాజాని చపాతీ తినేశావా? అని అడగడం ఇదేం రచ్చ బాబు అని ప్రేక్షకులకు కూడా కలిగేలా చేశారు.

ఇక హేమ వచ్చి.. నువ్ చపాతీ తినేశావని వాళ్లు అనుకుంటున్నారు.. అంటూ అలీ రాజా చెవిన వేయడంతో.. నేను ఎక్కడ తిన్నా.. తిన్నది నేను కాదు. బాబా భాస్కర్ అంటూ అసలు నిజం చెప్పారు అలీ.

బాబా భాస్కర్ వచ్చి.. కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నా అని తనదైన శైలిలో కామెడీ చేయడంతో.. గొడవకు కారణమైన చపాతీ సుందరి పునర్నవి అయ్యో మీరు తిన్నారా? అనవసరంగా నేను అలీని అనేశానే అని నాలుక కర్చుకుంటూనే మిగిలిని చపాతీని లాగించేసింది. పాపం అలీ రాజా లైట్ తీసుకోవడంతో వివాదం లేకుండానే ఈ చపాతి దొంగతనం డ్రామాకి తెరపడింది. పునర్నవి బయటపడింది.

లగ్జరీ బడ్జెట్‌ రచ్చ..
ఈ వారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘చాయిస్ యువర్స్’ అంటూ హేమ, జాఫర్‌లను టాస్క్ కోసం ఎంపిక చేసుకున్నారు కంటెస్టెంట్స్. ఈ ఇద్దరు గేమ్‌లో సక్సెస్ కావడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ సాధించారు. అయితే లగ్జరీ బడ్జెట్‌ను ఉపయోగించిన వారానికి సరిపడా సరుకులను కొనడంతో విఫలం అయ్యారు కంటెస్టెంట్స్. అయితే దీనికి కారణం శ్రీముఖి టైంకి లేకపోవడమే అని హేమ అనడంతో ఫైర్ అయ్యింది శ్రీముఖి.

అప్పటి వరకూ హేమతో అక్కా అంటూ చెట్టాపట్టాలేసుకుని బిగ్ బాస్ హౌస్‌లో తిరిగిన శ్రీముఖి.. తొక్కేంకాదు అంటూ రెచ్చిపోయింది. నేను టైంకి ఉన్నా.. అన్నం తింటే ఏంటి? నేను టైంకి వచ్చా.. ఆ టైంకి టీవీ ఆన్ చేయకపోవడంతో లేట్ అయ్యింది. తప్పు నాది కాదు.. టీవీ రిమోట్ మహేష్ దగ్గర ఉంది. అతను ఆన్ చేయకపోతే నువ్ నన్ను అంటావ్ ఏంటి? అంటూ హేమపై ఫైర్ అయ్యింది శ్రీముఖి.

నా పెళ్లానికి రెస్పెక్ట్ ఇవ్వు.. మహేష్‌ని కొట్టడానికి వెళ్లిన వరుణ్ .. 
ఇక ఈ రచ్చ కంటిన్యూ అవుతుండగానే.. మహేష్ విట్ట- వరుణ్ సందేశ్‌ల మధ్య కొట్లాట పెట్టింది.. వరుణ్ భార్య వితిక షెరు. నన్ను మహేష్ విట్టా.. లోపలికి పో అన్నాడు అంటూ వితికా గట్టిగా అరవడంతో సీన్‌లోకి దిగిన వరుణ్ సందేశ్ విశ్వరూపం చూపించాడు.

ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా? సిగ్గులేనోడా? అంటూ మహేష్‌ని కొట్టేందుకు మీది మీదికి పోతూ ఆగ్రహంతో ఊగిపోయాడు వరుణ్ సందేశ్. మహేష్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. వరుణ్ మీది మీదికి పోవడంతో ధీటుగా స్పందించాడు మహేష్. ఈ ఇద్దరూ రారా.. అంటే రారా అని కొట్టుకోవడానికి సిద్ధమవ్వగా మిగిలిన కంటెస్టెంట్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వితికా సైతం గట్టిగా అరుస్తూ మహేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం కంటిన్యూ అవుతుండగా.. నేటి ఎపిసోడ్‌ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా- వరుణ్ సందేశ్‌ల మధ్య రచ్చ రేగుతోంది. మరి ఈ వివాదానికి ఎలా పుల్ స్టాప్ పడిందే రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.
Please Read Disclaimer