బిగ్ బాస్3: ఎలిమినేషన్‌ నుండి ఇద్దరు ముద్దుగుమ్మలు సేఫ్

0

మ… మ.. మాస్ అంటూ మోడల్స్‌తో అదిరిపోయే స్టెప్పులేస్తూ పూలరంగడి మాదిరి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. వచ్చీ రావడంతో హౌస్‌లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ ముచ్చట్లను చూపించారు నాగార్జున. 

ఇక ఈవారం ఎలిమినేషన్స్ ఉండటంతో హౌస్ సభ్యులు సూట్ కేసులు సర్దేపనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న రాహుల్.. సూట్ కేస్‌తో కనిపించారు. 

మరోవైపు బాత్ టబ్‌లో రొమాంటిక్ ముచ్చట్లు మొదలెట్టారు వరుణ్, వితికాలు. ఒకరి కళ్లల్లో ఒకరు కళ్లు పెట్టు చూసుకుంటూ.. నేను ఎలిమినేట్ అయితే ఏం చేస్తావ్.. అంటూ వితికా రొమాంటిక్ మూడ్‌లో మాట్లాడగా.. ఆకలేస్తుంది బ్రెడ్ ముక్కలు ఉన్నాయా అని అడిగాడు వరుణ్. నా మొగుడ్ని విడిచి నేను ఉండలేను బిగ్ బాస్. మమల్ని వేరు చేయొద్దు అంటూ బిగ్ బాస్‌కి మస్కా కొట్టే ప్రయత్నం చేసింది వితిక. 

ఇక హౌస్‌లో తనదైన శైలిలో బాబా భాస్కర్‌తో కలిసి కామెడీ పంచుతున్న జాఫర్ హౌస్‌లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. తన భార్య గుర్తుకు రావడంతో.. వెక్కి వెక్కి ఏడ్చేశారు జాఫర్. శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్‌లు జాఫర్‌ను ఆ మూడ్‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్.. జాఫర్‌తో మూన్ వాక్ స్టెప్పులేయించడం నవ్వులు కురిపించాయి. 

తీన్మార్ సావిత్రి ఎమోషనల్ లవ్ స్టోరీ.. 
19 ఏళ్ల వయసులో ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్న తనను తన భర్త ఎంత బాగా చూసుకున్నారో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది శివజ్యోతి. ఊరంతా తనను ఒంటరిని చేసినా.. ఒక అబ్బాయి అమ్మాయికోసం పోరాడినట్టు తన భర్త కోసం 19 ఏళ్ల వయసులో పోరాడానని చెప్పింది. ఊరి నుండి పారిపోయి వచ్చిన తనను.. తన భర్త చాలా లగ్జరీగా చూసుకుని సంవత్సర పాటు తాను చదువుకోసం తెచ్చుకున్న డబ్బులతో నన్ను పెంచాడని చెప్పింది. తాగుబోతు అయిన తన తండ్రిని చివరి రోజుల్లో ఒక కొడుకుగా తన భర్త ఆదరించాడని.. ప్రతి అమ్మాయికి ఇలాంటి మంచి భర్త రావాలని కోరుకుంటూ ఏడ్చేసింది తీన్మార్ సావిత్రి. 

ఇక నాగార్జునను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న కంటెస్టెంట్స్‌కు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్‌ను పలకరించిన నాగ్.. పాసింగ్ పిల్లో ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడుతూ.. ఈ వారం రోజులు వాళ్లు ఇంట్లో ఎలా వ్యవహరించారో గుర్తు చేశారు. అయితే గత సీజన్ మాదిరిగా వాళ్ల నెగిటివ్స్‌ని ఎత్తి చూపి క్లాస్‌లు పీకకుండా వాళ్ల పాజిటివ్స్ మాత్రమే చర్చించారు. అందరితో చనువుగా మాట్లాడుతూ.. నాగ్ మార్క్ చూపించారు. 

ఎలిమినేషన్స్‌లో సేఫ్ అయ్యింది వీరే.. 
ఇక ఈవారం కీలకమైన ఎలిమినేషన్‌లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ నామినేట్ అయ్యారు. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు డేంజర్ జోన్‌లో ఉండగా.. ఈ ఆరుగురిలో సేవ్ అయిన తొలి కంటెస్టెంట్ హిమజ అంటూ ఆమె కళ్లల్లో ఆనందం నింపారు నాగార్జున. ఆయన హిమజ సేవ్ అయినట్టు తెలపగానే కన్నీళ్లు పెట్టుకుని ఎప్పటిలాగే ఏడ్చేసింది హిమజ. 

ఇక మిగిలిన ఐదుగురిలో పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిపారు నాగార్జున. దీంతో రాహుల్, వితికా, జాఫర్, హేమలు ఎలిమినేషన్‌లో ఉండిపోయారు. సో.. ఈ నలుగురిలో ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరూ తెలియాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. 
Please Read Disclaimer