బిగ్ బాస్: ఈవారం ఎలిమినేషన్‌లో 8 మంది.. పాపం శ్రీముఖి

0

బిగ్ బాస్ సీజన్ 3 అసలు మజా మొదలైంది. తొలివారం పూర్తి కావడంతో పాటు.. ఎలిమినేషన్‌లో భాగంగా హేమ బిగ్ బాస్ హౌస్‌ నుండి బట్టలు సర్దేస్తే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌లోకి వచ్చారు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. ఆమె రాకతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి.. ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ప్రారంభం కాబోతుంది లాంటి ఆసక్తికరపరిణామాలు మధ్య ‘గబ్బరసింగ్‌కి లైన్ వేశా.. కొంచెం తిక్కని వదిలాశా’.. పాటకు శ్రీముఖి పొట్టి నిక్కరుతో పిచ్చలేపే స్టెప్పులేస్తుండతా.. మల్లెపూల గుబాలింపుతో వయ్యారాలు ఒలకబోస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి. 

ఈవారం నామినేషన్స్ ఇంట్రస్టింగ్.. దటీజ్ బాబా భాస్కర్ 

ఇక ఈవారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నామినేషన్స్ నిర్వహించారు బిగ్ బాస్. ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫిషన్ రూంకి పిలిచి.. ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నాను నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక నామినేషన్ ప్రారంభమైన తరువాత ఎవరితోనూ చర్చించకూడదనే నిబంధనను పాటించని కారణంగా వరుణ్ సందేశ్ భార్య వితికా.. నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు బిగ్ బాస్. 

ఇక ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..

1. హిమజ.. పునర్నవి, రాహుల్ 
2. వరుణ్.. జాఫర్, శ్రీముఖి 
3. అషూ.. శ్రీముఖి, రాహుల్ 
4. రాహుల్.. హిమజ, శ్రీముఖి 
5. శివజ్యోతి.. శ్రీముఖి,జాఫర్ 
6. అలీ రజా.. హిమజ, వరుణ్ సందేశ్ 
7. రవిక్రిష్ణ.. హిమజ,జాఫర్ 
8. జాఫర్.. రితిక, మహేష్ 
9. రోహిణి.. రితిక, మహేష్ 
10. మహేష్.. రితిక, వరుణ్ సందేశ్ 
11. శ్రీముఖి… హిమజ, మహేష్ విట్టా 
12. పునర్నవి.. హిమజ, శ్రీముఖి 
13. తమన్నా.. వరుణ్ సందేష్, వితిక 
14. బాబా భాస్కర్.. వితిక, రాహుల్‌ 

కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు బాబా భాస్కర్. బిగ్ బాస్ ఇద్దర్ని నామినేట్ చేయమంటే.. హౌస్‌కి వచ్చి వారమే అయ్యింది. ఏదో ఒక కారణంతో ఇద్దర్ని నామినేట్ చేయమంటే నేను చేయలేను. కావాలంటే నన్ను నామినేట్ చేసుకోండి అని తెగేసి చెప్పారు బాబా భాస్కర్. అయితే ప్రతి వారం నామినేషన్ జరుగుతుంటాయని.. తప్పకుండా ఇందులో ఇద్దరు పేర్లు చెప్పాలని బిగ్ బాస్ కన్వెన్స్ చేసినా వెనక్కి తగ్గలేదు బాబా భాస్కర్. మీకు మరికొంత సమయం ఇస్తున్నా.. ఆలోచించుకుని అందరి నామినేషన్స్ పూర్తైన తరువాత మీరు చెప్పాలని మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. 

ఆ తరువాత కూడా నేను నామినేట్ చేయలేనని.. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్‌కి బాబా భాస్కర్ ఛాయిస్ ఇవ్వడంతో.. మీరు ఇద్దరి పేర్లైనా చెప్పాలి. లేదంటూ మొత్తం నామినేషన్ క్యాన్సిల్ చేసి హౌస్ మొత్తాన్ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తామనడంతో.. బాబా భాస్కర్ రెండో కన్ఫిషన్ రూంకి వెళ్లి.. వితిక, రాహుల్ పేర్లను చెప్పారు. 

చివరికి ఈ మొత్తం నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం కాగా.. ఎక్కువ మంది శ్రీముఖి, హిమజలను నామినేట్ చేశారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ సరిగా ఉండటం లేదంటూ వీటిపై చర్చలు జరుగుతుండగా.. నేటి ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. రేపటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాటర్‌తో పాటు గ్యాస్‌ని కూడా నిలిపివేయడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 
Please Read Disclaimer