‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్స్: ఫస్ట్ ఛాన్స్ ‘తీన్మార్’కే!

0

మోస్ట్ వాంటెండ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ మొదలైంది. నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై సందడి షురూ అయ్యింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ షోలో కింగ్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ హౌజ్‌లోకి వెళ్లి అన్నింటినీ పరిశీలించారు. నాగార్జునను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఆయనకు ఒక టాస్క్ కూడా ఇచ్చారు. 15 మంది సెలబ్రిటీల్లో మొదటి ముగ్గురిని పరిచయం చేసే అవకాశం నాగార్జున ఇచ్చారు. దీంతో చిట్టీలు తీసి నాగార్జున ఆ ముగ్గురు కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు.

మొదటి కంటెస్టెంట్‌గా శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని నాగార్జున ఆహ్వానించారు. సావిత్రిక్క స్టైల్లోనే శివజ్యోతి ఎంట్రీ ఇచ్చింది. చక్కగా సంప్రదాయ దుస్తుల్లో శివజ్యోతి అడుగుపెట్టింది. చేతిలో ట్రంకు పెట్టితో వచ్చింది. ఆమెను నాగార్జున.. ‘వెల్‌కమ్ శివజ్యోతక్క’ అంటూ ఆహ్వానించారు. ‘సార్.. మీకు నేను అక్కనేంటి’ అంటూ శివజ్యోతి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ‘నువ్వు అందరికీ అక్కవే’ అంటూ నాగార్జున బదులివ్వడంతో నవ్వులు పువ్వులు పూశాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా సరదాగా సాగింది.
Please Read Disclaimer