ఈసారి కూడా ఆర్మీలు సిద్దం!

0

ఉత్తరాదిన ఎన్నో ఏళ్లుగా బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఎన్నో సీజన్ లు పూర్తి చేసుకుంది. సౌత్ లో ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో మూడవ సీజన్ సాగుతున్న విషయం తెల్సిందే. ఉత్తరాదిన ఎప్పుడు లేని కంటెస్టెంట్ ఆర్మీలు సౌత్ లో మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సీజన్ 2 నుండి ఆర్మీలు మొదలు అయ్యాయి. కౌశల్ ఆర్మీ నుండి మొదలుకుని అందరికి ఆర్మీలు ఏర్పడ్డాయి. తెలుగు సీజన్ 3 కి కూడా ఆర్మీలు సిద్దం అయ్యాయి.

సోషల్ మీడియాలో కంటెస్టెంట్ పేరుతో ఆర్మీలు మొదలవ్వడం చాలా కామన్ గా జరుగుతుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం ఫేక్ ఆర్మీలే ఉంటున్నాయి. ఆ ఆర్మీలకు ఉండే ఫాలోవర్స్ కూడా ఫేక్. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇప్పటికే కొన్ని అకౌంట్స్ ను కలిగి ఉంటారు. వాటికి భారీగా ఫాలోవర్స్ ఉంటారు. వాటికి కంటెస్టెంట్ పేరుతో ఆర్మీ అంటూ రీ నేమ్ చేయడం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సీజన్ ప్రారంభం అయ్యి ఇంకా వారం రోజులు కూడా కాలేదు కనుక అప్పుడే ఆర్మీల సందడి ఎక్కువ కాలేదు. కొన్ని ఆర్మీలు ప్రారంభం అయినా కూడా అవి యాక్టివ్ గా లేవు. రెండవ వారం నుండి ఈ ఆర్మీల సందడి ఉంటుదని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీముఖి ఆర్మీ అంటూ ఒకటి ఏర్పడి శ్రీముఖి ఎలిమినేట్ అయితే అన్నపూర్ణ స్టూడియో ముందు రచ్చ చేస్తామంటూ హెచ్చరించారు. ఇలాంటివి ముందు ముందు మరెన్నో ఉంటాయి. ఆర్మీల పేరుతో ఇతర కంటెస్టెంట్ ను బూతులు తిట్టడం కుటుంబ సభ్యులను అగౌరవ పర్చుతూ వ్యాఖ్యలు చేయడం జరగొచ్చు. ఇలాంటి ఫేక్ ఆర్మీలను పట్టించుకోకుండా ఉంటే బెటర్.
Please Read Disclaimer