బిగ్ బాస్ కమిట్‌మెంట్‌పై పునర్నవి ఓపెన్ స్టేట్‌మెంట్

0

బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. బిగ్ బాస్‌కి నచ్చినట్టు కాదు.. నాకు వచ్చినట్టు మాత్రమే గేమ్ ఆడతానని.. బిగ్ బాస్‌నే ‘నీకంత సీన్ లేదు.. నువ్వు చెప్పిందే కరెక్ట్ కాదు.. ఇలాంటి చెత్త గేమ్‌లు పెట్టకు’ అంటూ వార్నింగ్ ఇచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది పునర్నవి భూపాలం.

తెనాలిలో పుట్టి, విజయవాడలో ఎడ్యుకేషన్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో సెటిల్ అయిన పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎందుకు ఏమో’ చిత్రాల్లో నటించినప్పటికీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గానే పునర్నవి క్రేజ్ సంపాదించింది.

11 వారాలు పాటు బిగ్ బాస్ షోకి గ్లామర్ హంగులు అద్దిన ఈ బ్యూటీ.. రాహుల్‌తో నడిపిన లవ్ ట్రాక్ హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా రాహుల్‌కి ఫుల్ సపోర్ట్ చేసి అతని విజయంలో కీలకపాత్ర పోషించిన పునర్నవి భూపాలం.. ‘సమయం’తో ముచ్చటించారు. ఆ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..
Please Read Disclaimer