బిగ్ బాస్ : భగ్న ప్రేమికుడి బాధలు

0

మొన్నటివరకు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమపావురాలు లాగా హల్చల్ చేసిన పునర్నవి-రాహుల్ జంట విడిపోయింది. ఆదివారం ఎపిసోడ్లో పున్నూ ఎలిమినేట్ కావడంతో రాహుల్ తెగ బాధపడిపోతున్నాడు. ఆదివారం గుక్క పెట్టి ఏడ్చిన రాహుల్….సోమవారం ఎపిసోడ్ లో కూడా బాధపడుతూనే ఉన్నాడు. తన బాధని వరుణ్ వితికాకు చెప్పుకుంటూ… ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకోకూడదని పెంచుకుంటే పరిస్థితి నాలాగే ఉంటుందని తెగ బాధ పడ్డాడు. నేను బయటకు వెళ్లిన తరువాత పునర్నవి నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో కూడా డౌటే అంటూ మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు.

మరోవైపు వితికా…తాను ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్ అని వరుణ్తో ముచ్చట్లు పెట్టింది. 17 మంది కంటెస్టంట్స్ లో టాప్-8 లో ఉండటం చాలా గొప్పగా ఉందని… తనకు తానే డప్పు కొట్టుకునే ప్రయత్నం చేసింది. పైగా స్మార్ట్ ప్లే చేసి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ గెలుచుకున్నందుకు మా ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారని మాట్లాడింది. వితికా గ్రేట్…వితికా గ్రేట్ అని అంటుంటే చాలా ఆనందంగా ఉందంటూ తెగ సంతోష పడిపోయింది.

ఇక వీరి ఎపిసోడ్ తర్వాత శివజ్యోతి అలీ ముచ్చట్లు పెట్టుకున్నారు. వారం నుంచి రాహుల్ ఒంటరిగా కూర్చుని తనకు ఎవరు లేరు అన్నట్లు సింపతీ కొట్టేయడానికి చూస్తున్నట్లు కనిపిస్తుందని అన్నాడు. ఇప్పుడు కూడా అలా కూర్చుని నటిస్తున్నాడేమో అని అలీ జ్యోతితో చెప్పాడు. అందుకే రెండు రోజుల నుంచి పున్నూతో గొడవపడి ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్నాడని అన్నాడు. అయితే అలీ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గేమ్ ఆడకుండా అమ్మలక్కల ముచ్చట్లు పెడుతున్న విషయం తెలిసిందే.
Please Read Disclaimer