బిగ్బాస్: టాప్-5లో ఆ ఇద్దరి ఎంట్రీ ఖాయమే..!

0

ఖచ్చితంగా పది అంటే పది రోజుల్లో బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే బిగ్ బాస్ టాప్-5లోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక మిగిలిన ఐదుగురు కంటెస్టంట్స్ లో ఈ వారం ఒక్కరు ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన నలుగురు టాప్-5లోకి రీచ్ అవుతారు. అయితే టాప్-5లోకి శ్రీముఖి బాబా భాస్కర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. వాళ్ళు నామినేషన్లో ఉన్నా ఖచ్చితంగా సేవ్ అయ్యి టాప్-5లోకి వెళతారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది.

ఇక ఇదే విషయాన్ని ఇంటిలోని మిగతా సభ్యులు కూడా ఒప్పుకున్నారు. బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్న ఐదుగురు సభ్యులకు…ఓట్ల కోసం వేట అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు టాస్క్ లు విజయవంతంగా పూర్తి చేసి అభిమానుల మెప్పు పొంది ఓట్లు పడేలా చేసుకోవాలి. బుధవారం ఎపిసోడ్లు ఐదుగురు సక్సెస్ ఫుల్ గా టాస్క్ లు పూర్తి చేశారు. ఇక గురువారం ఎపిసోడ్లో రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చారు.

దీని ప్రకారం ఒక్కో కంటెస్టంట్ రంగు తీసుకుని ఇంకో కంటెస్టంట్ ఫైనల్కు వెళ్ళేందుకు ఎందుకు అర్హత లేదో చెప్పి రంగు వేయాలి. దీంతో మొదట బాబా భాస్కర్..అలీకి అర్హత లేదని పలు కారణాలు చెప్పి రంగు కొట్టాడు. నెక్స్ట్ శివజ్యోతి వరుణ్ కు అర్హత లేదని రంగు వేసింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇక తర్వాత శ్రీముఖి….శివజ్యోతికి అర్హత లేదని రంగు వేసింది. అయితే అలీ మాత్రం….శ్రీముఖికు టాప్-5లోకి వెళ్ళేందుకు అర్హత ఉందని రంగు వేయలేదు. అలాగే వరుణ్ కూడా…బాబాకు అర్హత ఉందని రంగు వేయలేదు.

కానీ ఇందులో ఒక్కరే విన్నర్ గా నిలవాలని చెప్పడంతో వరుణ్ బాబా మీద అయిష్టంగానే రంగు వేశాడు. దీంతో శ్రీముఖి విన్నర్ గా నిలిచింది. దీని బట్టి చూస్తే హౌస్ మేట్స్ కూడా శ్రీముఖి బాబా భాస్కర్కు టాప్-5 వెళ్ళేందుకు అర్హత ఉందని డైరెక్ట్ గానే చెప్పారు. అలాగే బయట కూడా వీరిద్దరు తప్పకుండా ఫినాలేకు చేరుకుంటారని అంటున్నారు. ఈ వారం వరుణ్ శివజ్యోతి అలీల్లో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో ? చూడాలి

Comments are closed.